బాదం-జీడిపప్పులతో పూరీ ఎలా?

జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది. జీడిపప్పులో కాపర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇ

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (15:47 IST)
జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది. జీడిపప్పులో కాపర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది ఎంజైమ్‌ల పనితీరులో కీలకంగా వ్యవహరిస్తుంది. మెదడు చురుకుగా ఉండటంలోనూ సాయపడుతుంది. పిల్లలకు ఇదెంతో మేలు చేస్తుంది. 
 
జీడిపప్పులో లభించే జింక్‌.. ఇన్‌ఫెక్షన్లపై పోరాడుతుంది. అలాగే బాదం పప్పులు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్- ఇ అధికంగా ఉన్న బాదం పప్పులు గుప్పెడు తింటే వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ రెండింటిని పిల్లలు అలాగే తినేందుకు ఇష్టపడకపోతే.. వేడి వేడి పూరీలతో కలిపి ఇవ్వడం చేయండి. బాదం, జీడిప్పులతో పూరీ ఎలా చేయాలో చూద్దాం..  
 
కావలసినవి 
రవ్వ- పావు కప్పు 
గోధుమపిండి - అర కిలో
నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు,
బాదం పొడి- అర కప్పు
జీడిపప్పు పొడి - అర కప్పు 
నూనె - తగినంత 
 
తయారీ విధానం:
గోధుమపిండి మిశ్రమంలో నెయ్యి వేసి కలపాలి. తరవాత బాదం, జీడిపప్పు పొడిని కలిపి చపాతీపిండిలా కలపాలి. పిండిముద్దమీద తడిబట్ట కప్పి 15 నిమిషాలు పక్కనబెట్టాలి. వీటిని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనీ పూరీలా చేసి వేడైన నూనెలో పూరీల్లా కాల్చాలి. ఇరువైపులా పూరీలు బ్రౌన్‌గా వచ్చాక ఆయిల్ లేకుండా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని.. హాట్ హాట్‌గా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిప్పుల కుంపటిగా ఆంధ్రప్రదేశ్ - భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్న జనం

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. పార్టీ కార్యవర్గం రద్దు

మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ... భర్తను చున్నీతో చంపేసిన భార్య .. ఎక్కడ?

కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)

కోవైలో పదేళ్ల బాలిక చనిపోతే.. ప్రెస్‌మీట్‌లో నవ్వుతూ బదులిస్తారా? విజయ్ సీరియస్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments