Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా దినోత్సవం ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (09:52 IST)
టిటిడి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై జెఈఓ(ఆరోగ్యం మ‌రియు విద్య‌) స‌దా భార్గ‌వి శ‌నివారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. 
 
ఈ సందర్భంగా పలు రంగాల్లో నిష్ణాతులైన మహిళలను ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాలన్నారు. మహిళా ఉద్యోగులకు దేశభక్తి, భక్తి పాటలు, వ్యాసరచన, చిత్రలేఖ‌నం పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయాలన్నారు. 
 
అనంతరం కార్యనిర్వాహక‌, వక్తల ఎంపిక, జ్ఞాపికల కొనుగోలు, సాంస్కృతిక కమిటీలను ఏర్పాటు చేశారు. స్థాయితో సంబంధం లేకుండా మ‌హిళా ఉద్యోగులంద‌రూ పాల్గొనేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.
 
ఈ సమావేశంలో టిటిడి ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌లక్ష్మి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి స్నేహలత, శ్రీమతి శాంతి, శ్రీ ఆనంద‌రాజు, ఎస్వీ సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ శ్రీ‌మ‌తి జ‌మునారాణి, మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ కుసుమ‌, ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రి వైద్యురాలు డాక్ట‌ర్ రేణు దీక్షిత్‌, సంక్షేమ విభాగం సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి శ్రీ‌వాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments