నుదిటిన బొట్టు ఇలా పెట్టుకుంటే..?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:13 IST)
ప్రతీ స్త్రీకి నుదిటిపై బొట్టు ఆకర్షణీయంగా ఉంటుంది. మరింత అందాన్ని చేకూర్చుతుంది. అలాంటి బొట్టును ఎలా పేడితే ముఖ అందం మరింత పెరుగుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కింది అంశాలు పరిశీలిస్తే చాలు.
 
1. మనం ధరించే దుస్తుల రంగును బట్టి ఎలాంటి బొట్టైన పెట్టుకోవచ్చు. ఆ బొట్టు కూడా అంత పెద్దదిగా కాకుండా కాస్త చిన్న ఆకారంలో ఉండే విధంగా ఎంచుకోవాలి. 
 
2. నుదురు పెద్దగా ఉండేవారు బొట్టును కనుబొమల మధ్య కాకుండా కొంచెం పైకి పెట్టుకుంటే అందంగా ఉంటుంది. తెల్లని శరీరఛాయ కలిగిన వారికి ముదురురంగు బొట్టు ఆకర్షణీయంగా ఉంటుంది. 
 
3. నుదురు ఆకృతిని బట్టి ఏ రంగు బొట్టు బాగుంటుందో చూసుకోవాలి. నుదురు చిన్నగా ఉంటే కొంచెం పొడవుగా ఉండే బొట్టు పెట్టుకోవాలి. నుదురు వెడల్పుగా ఉంటే గుండ్రని బొట్టు పెట్టుకుంటే మరింత అందాన్నిస్తుంది. 
 
4. చామనఛాయ లేదా కాస్త రంగు తక్కువగా వారైతే గులాబీ, నారింజ, గంధపు రంగు, ఎరుపు రంగు బొట్టు కళగా వుంటాయి. కళ్ళు పెద్దవిగా ఉంటే పెద్ద బొట్టు, చిన్నగా ఉంటే కొంచెం చిన్నసైజు బొట్టు శోభాయమానంగా వుంటుంది.
 
5. నుదురు పెద్దగా ఉన్నవారు పెద్ద బొట్టు పెట్టుకుంటే నుదురు పెద్దగా వున్న విషయం అంతగా తెలీదు. చిన్నవాళ్ళకి రకరకాల ఆకృతులు, మ్యాచింగ్ రంగుల బొట్టు పెట్టుకున్నా బావుంటుంది. కానీ మధ్య వయసు వారికి ఎరుపు, పింక్ వంటి రంగులు, గుండ్రటి బొట్టు నిండుదనాన్నిస్తుంది. పొట్టిగా వున్నవాళ్ళు పొడుగు బొట్టు పెట్టుకొంటే అందంగా, హుందాగా కనిపిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్.. సజ్జనార్, అనిత కితాబు (video)

నకిలీ మద్యం కేసు: జోగి సోదరులకు బెయిల్ మంజూరు.. కారణం?

ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

జెడ్పీటీసీ ఎన్నికలు.. సింహం గుర్తు కోసం కసరత్తు.. 20-30 స్థానాల్లో కవిత పార్టీ పోటీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది

VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్

Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్

ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్

తర్వాతి కథనం
Show comments