Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంటి ఆరోగ్యానికి ఇలా చేయాల్సిందే..?

Advertiesment
కంటి ఆరోగ్యానికి ఇలా చేయాల్సిందే..?
, శుక్రవారం, 14 డిశెంబరు 2018 (11:10 IST)
సాధారణంగా మహిళలకు కంటి కింద నల్లటి వలయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వలయాలు ఎందుకు వస్తాయంటే.. నిద్రలేమి, ఒత్తిడి, అలసట వలన వస్తాయి. వీటి కారణంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. మరి వీటిని తొలగించాలంటే ఏం చేయాలో చూద్దాం..
 
1. కళ్లకు విశ్రాంతి ఎంతైనా అవసరం. రోజుకు 8 గంటల పాటు తప్పకుండా నిద్రించాలి. అప్పుడే కంటికి విశ్రాంతి లభిస్తుంది. అలానే అప్పుడప్పుడు కంటితో వ్యాయామం కూడా చేయాలంటున్నారు నిపుణులు.
 
2. కీరా రసంలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి కంటి కింద రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ క్రమంగా చేస్తే నల్లటి చారలు పోయి ముఖం తాజాగా మారుతుంది. 
 
3. బయటదొరికే క్రీమ్స్ కంటికి ఉపయోగించరాదు. ఈ క్రీమ్స్‌లోని కెమికల్స్ కంటి ఇన్‌ఫెక్షన్స్‌కు దారితీస్తాయి. దాంతో కళ్లు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. అందువలన ఇలాంటి పదార్థాలు ఉపయోగించరాదని చెప్తున్నారు. 
 
4. చాలామంది డాక్టర్ సూచన లేకుండానే రకరకాల ఐ డ్రాప్స్ వాడుతుంటారు. వీటి వాడకం వలన దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. దీంతో కళ్లు రక్షణను కోల్పోతాయి. కనుక డాక్టర్ సూచన మేరకు ఎలాంటి ఐ డ్రాప్స్‌నైనా వాడుకోవచ్చు. 
 
5. కంటి చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాలలో ఏర్పడే మీగలలో కొద్దిగా వంటసోడా కలిపి కంటి కింద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే కంటి ముడతలు పోయి కళ్ళు కాంతివంతంగా మారుతాయి.         

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉసిరికాయలను తిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుంది?