చాలామంది తరచు చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. అందుకు ఎలాంటి పద్ధతులు పాటించినా ఫలితం లేదు. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు కారణంగా పదిమందిలో తిరగలేకపోతున్నానని ఆలోచన చెందుతారు. దీనిని ఎదుర్కొనేందుకు పరిష్కార మార్గాలివే.
1. బీట్‌రూట్‌ను పేస్ట్‌లా చేసుకుని అందులో పావుకప్పు ఉల్లిపాయ రసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే క్రమంగా చుండ్రు పోతుంది.
2. నానబెట్టిన మెంతులను పేస్ట్ చేసి అందులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలిపి జుట్టుకు పూతలా వేయాలి. దీంతో చుండ్రు పోతుంది. వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
3. ఉల్లిపాయ రసంలో స్పూన్ తేనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని గంటపాటు అలానే ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తద్వారా జుట్టు మృదువుగా మారుతుంది. చుండ్రు సమస్య ఉండదు.
4. ఉల్లిపాయను కట్ చేసి పేస్ట్ చేసి తలకు రాయాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. జుట్టు రాలకుండా ఉంటుంది.
5. ఉల్లిపాయ రసంలో కొద్దిగా కలబంద గుజ్జు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూతలా రాయాలి. అరగంట ఆగాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు రాదు.