వర్క్ ఫ్రమ్ హోమ్.. మహిళలు బరువు పెరిగిపోతారు జాగ్రత్త.. ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (20:35 IST)
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మహిళలు లేదా పురుషులు కూడా బరువు పెరిగిపోతారని.. అందుకే సరైన పోషకాహారం, వ్యాయామం తప్పనిసరి అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కరోనా కారణంగా ఉద్యోగులందరికి వర్క్ ఫ్రం హోమ్ అలవాటైంది. ఇంట్లో ఉండే సరికి ఏదిపడితే అది తినేసి అధికంగా బరువు పెరుగుతున్నారు. ఆ తర్వాత అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. 
 
శారీరక శ్రమ లేకపోతే బరువు పెరగడంతో పాటు జీవనశైలికి సంబంధించిన వ్యాధులైన బీపీ, షుగరు, హై కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడే అవకాశం లేకపోలేదు. అందుకే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. అధిక బరువు నుంచి తప్పించుకోవచ్చు. 
 
అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంటి నుంచి పని చేసేప్పుడు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఓ సమయం నిర్ధారించుకుని కేవలం అప్పుడు మాత్రమే ఆహారం తీసుకోండి. చిరుతిండ్లను మానేయాలి.ఆఫీసు పని కానీ, టీవీలు, ఫోనులు చూస్తూ తింటే ఎక్కువగా భోంచేసే ప్రమాదం ఉంది.
 
అలాగే పండ్లు, గింజలు లాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తప్ప బిస్కెట్స్‌, వేయించిన చిరుతిళ్ళు, స్వీట్స్‌ను అందుబాటులో పెట్టుకోకూడదు. పిల్లలకు కూడా పాలు, పండ్లు, మొలకెత్తిన ఉడికించిన గింజలతో చేసిన చాట్‌, ఆమ్లెట్‌, సూప్స్‌ స్నాక్స్‌గా ఇవ్వాలి తప్ప జంక్‌ ఫుడ్స్‌ వద్దు.
 
శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు క్యాలోరీలు కూడా తగ్గించకపోతే నెమ్మదిగా బరువు పెరుగుతారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసేప్పుడు ఆఫీసు ప్రయాణాలు తగ్గుతాయి. కాబట్టి రోజూ కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం తప్పనిసరిగా చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments