Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముందుగానే అనారోగ్యం ఉన్న వారు ఆరోగ్య బీమా ఎలా కొనాలంటే?

ముందుగానే అనారోగ్యం ఉన్న వారు ఆరోగ్య బీమా ఎలా కొనాలంటే?
, బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (12:50 IST)
ఇటీవలనే సుభాష్‌ యాదవ్‌ తన తండ్రి అశోక్‌ యాదవ్‌ను తీవ్రమైన రక్తపోటు కారణంగా హాస్పిటల్‌లో చేర్చారు. చికిత్స పూర్తయి ఇంటికి వచ్చేసరికి 1.08 లక్షల రూపాయల బిల్లు అయింది. గత 15 సంవత్సరాలుగా అశోక్‌ టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ కారణం చేత అతను తరచుగా హాస్పిటల్‌కు వెళ్లడం, వెళ్లిన ప్రతిసారీ 1-2 లక్షల రూపాయలు ఖర్చు కావడం జరుగుతుంది.
 
సుభాష్‌ ఎప్పుడూ తన తండ్రికి సమగ్రమైన ఆరోగ్య బీమా తీసుకుందామనుకుంటున్నాడు కానీ, తన తండ్రికి మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు ఉండటం వల్ల ఎవరూ పాలసీ ఇవ్వరని భావిస్తుండేవాడు. అయితే తన చిన్ననాటి స్నేహితుడు రాకేష్‌ను కలుసుకున్న తరువాతనే మధుమేహంతో సహా ఇతర అనారోగ్యాలతో బాధ పడుతున్న వారికి సైతం ఆరోగ్య బీమా లభిస్తుందని తెలిసింది.
 
ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, దీర్ఘకాల వ్యాధులతో బాధ పడుతున్న వారికి తప్పనిసరి వెయిటింగ్‌ పీరియడ్‌ పూర్తయిన తరువాత మాత్రమే పాలసీ కవరేజీ లభిస్తుందని. ఇప్పుడు కొన్ని పాలసీలు అయితే 0 నుంచి 4 సంవత్సరాల వెయిటింగ్‌ పీరియడ్‌తో ముందుగానే ఉన్న అనారోగ్యాలకు సైతం కవరేజీ అందిస్తున్నాయి.
 
ముందుగానే అనారోగ్యం ఉన్న వారు ఆరోగ్య బీమా ఎలా కొనాలంటే?
ముందుగానే కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కూడా ఆరోగ్య బీమా కొనుగోలు చేసేలా ఐఆర్‌డీఏ, బీమా సంస్ధలు నిబంధనలు రూపొందించాయి. ఇప్పుడు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు బీమాను అతి సులభంగా కొనుగోలు చేయవచ్చు. డిజిటల్‌ అండర్‌ రైటింగ్‌ ప్రక్రియ ద్వారా కొన్ని తరహా అనారోగ్యాలకు వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు.
webdunia
ఇక ఇటీవలి కాలంలో కొన్ని పాలసీలు డిసీజ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రయోజనాలను సైతం అందిస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు అదనపు ప్రయోజనం పొందవచ్చు. ఇక అతి ముఖ్యమైనది అతి తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌. సాధారణంగా ఆరోగ్య బీమా పథకాలన్నీ ముందుగానే దీర్ఘకాల వ్యాధులు కలిగిన వారికి 2-4 సంవత్సరాల వెయిటింగ్‌ పీరియడ్‌తో వస్తాయి. అయితే ఇటీవలి కాలంలో తొలి రోజు నుంచే కవరేజీ అందించే ప్లాన్స్‌ కూడా వచ్చాయి. దీనివల్ల 20 సంవత్సరాలుగా రక్తపోటుతో బాధపడే వారు కూడా ఆరోగ్య బీమా పొందవచ్చు.
 
నిబంధనలూ వర్తిస్తాయి...
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు వాస్తవాలు చెప్పడం వల్ల తరువాత కాలంలో అంటే క్లెయిమ్‌ కాలంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. ఆరోగ్య బీమా కొనుగోలులో నిజాయితీ చాలా ముఖ్యం. ఇక పాలసీ కొనుగోలు సమయంలో పరిగణలోకి తీసుకోవాల్సిన మరో ముఖ్య అంశం వెయిటింగ్‌ పీరియడ్‌. కనీస వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటే దీర్ఘకాల సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుంది. వీటితో పాటుగా జీరో కో-పేమెంట్‌, చికిత్స సమయంలో సబ్‌ లిమిట్స్‌, రూమ్‌ రెంట్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటే నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
 
-అమిత్‌ చాబ్రా, హెల్త్‌–బిజినెస్‌ హెడ్‌, పాలసీ బజార్‌ డాట్‌ కామ్‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. దీర్ఘాయుష్షును..?