Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ టీ రోజూ తాగితే.. పొట్ట ఫ్లాట్ అవ‌డం ఖాయం.. తెలుసా..?

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (20:25 IST)
గ్రీన్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గ్రీన్ టీలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి. ద‌గ్గు, ఫ్లూ జ్వ‌రం త‌దిత‌ర వ్యాధుల నుంచి ఇవి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో గ్రీన్ టీ అద్భుతంగా ప‌నిచేస్తుంది. 
 
గ్రీన్ టీలో అస‌లు క్యాల‌రీలు ఉండ‌వు. అంతేకాకుండా గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఇత‌ర ఆహారాల‌పై ఆస‌క్తి త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు ఉపయోగ‌ప‌డుతుంది. గ్రీన్ టీ లో కాటెకిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. నిత్యం 2 నుంచి 3 క‌ప్పుల గ్రీన్ టీని తాగ‌డం అల‌వాటు చేసుకుంటే పొట్ట ఫ్లాట్ అవ‌డం ఖాయమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
గ్రీన్ టీలో చ‌క్కెర కాకుండా తేనె క‌లుపుకుని తాగితే ఇంకా అద్భుత‌మైన లాభాలుంటాయి. అయితే గ్రీన్ ఎంత ఆరోగ్య‌క‌రం అయినప్ప‌టికీ దాన్ని మోతాదుకు మించి సేవించ‌రాదు. గ్రీన్ టీ అధికంగా తాగితే డీహైడ్రేష‌న్‌, అసిడిటీ పెరుగుతాయి. క‌నుక గ్రీన్ టీని మోతాదులో తాగితే అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments