Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిప్‌స్టిక్ విక్రయాలు నిల్ - నెయిల్ పాలిష్ సేల్స్ అదుర్స్!

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (09:30 IST)
బాహ్య సౌందర్యానికి మహిళలు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. పక్కా పల్లెటూరు అమ్మాయి నుంచి మెట్రోనగరాల్లో జీవించే మహిళ వరకు బాహ్య సౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం తమకు అందుబాటులో అన్ని రకాల కాస్మోటిక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే, కరోనా వైరస్ దెబ్బకు ఈ కాస్మోటిక్స్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయట. ముఖ్యంగా పెదవులకు వేసుకుని లిప్‌స్టిక్ విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయట. అదేసమయంలో నెయిల్ పాలిషన్ రంగులు విక్రయాలు మాత్రం ఏకంగా 24 శాతం మేరకు పెరిగాయట. లిప్‌స్టిక్‌లపై పెద్దగా శ్రద్ధ చూపని అమ్మాయిలు, మహిళలు, గోళ్ళను మరింత అందంగా ఉంచుకునేందుకు అధిక సమయం వెచ్చిస్తున్నారట. 
 
దేశ వ్యాప్తంగా లిప్‌స్టిక్ విక్రయాలు తగ్గిపోవడానికి కారణం లేకపోలేదు. కరోనా ప్రభావంతో అందరూ ఇంటి పట్టునే ఉండటం, బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాల్సి రావడంతో... లిప్ స్టిక్‌ల సేల్స్ పడిపోయాయట. ఇదేసమయంలో 'ఐ మేకప్స్ (కంటి సౌందర్యానికి వాడేవి)' కొనుగోళ్లు మాత్రం పెరుగుతున్నాయి. కార్యాలయాల్లో సైతం మాస్కులు ధరించాలనే నిబంధన ఉండటంతో మహిళలు లిప్ స్టిక్ వాడకం బాగా తగ్గించారని చెపుతున్నారు.
 
ఇదే అంశంపై ప్రముఖ కాస్మొటిక్స్ కంపెనీ లోరియల్ ఇండియా డైరెక్టర్ కవిత ఆంగ్రే స్పందిస్తూ, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని, వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారని... దీంతో లిప్ స్టిక్‌కు డిమాండ్ పడిపోయిందని చెప్పారు. అధికారికంగా వీడియో ప్రజెంటేషన్‌లో కనిపించాల్సి వచ్చినప్పుడే లిప్ స్టిక్‌తో పాటు.. బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 
 
అలాగే, హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా కొనుగోళ్లు తగ్గాయని... మార్కెట్ పూర్తి స్థాయిలో తెరుచుకున్న వెంటనే అన్నీ పూర్వ స్థితికి వస్తాయని భావిస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ మునుపటిలా విక్రయాలు ఉండబోవన్నారు. దీనికి ప్రధాన కారణం ముఖానికి మాస్క్ ధరించాలన్న నిబంధన ఉండటమేనని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments