Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ టాపిక్‌గా గాలి జనార్ధన రెడ్డి కుమార్తె వివాహ ఆహ్వానం.. అంతా కలిసి వీడియోలో స్వాగతం(Video)

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ సామ్రాజ్యానికి అధిపతి గాలి జనార్ధనరెడ్డి కూతురికి సంబంధించిన పెళ్లి కార్డ్ ఆసక్తి రేకెత్తిస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో జైలు శిక్షను అనుభవించి, ఇటీవలే బెయిల్ మీద విడుదలైన గాలి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం వచ్చ

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (15:45 IST)
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ సామ్రాజ్యానికి అధిపతి గాలి జనార్ధనరెడ్డి కూతురికి సంబంధించిన పెళ్లి కార్డ్ ఆసక్తి రేకెత్తిస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో జైలు శిక్షను అనుభవించి, ఇటీవలే బెయిల్ మీద విడుదలైన గాలి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం వచ్చే నెలలో జరగనుంది. గత నెలలో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించిన గాలి కుటుంబం, చరిత్రలో నిలిచిపోయే విధంగా పెళ్లిని అంగరంగ వైభవంగా చేసేందుకు సిద్ధమయ్యారు. 
 
ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వీడియోతో ఆహ్వాన పత్రికను ఒక ఖరీదైన జ్యూయలరీ బాక్స్‌ రూపంలో రూపొందించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే  తెరిచి చూడగానే, మాయాబజార్ సినిమాలో కనిపించినట్లు వీడియో ప్లే అవుతుంది. పెళ్లికి తరలి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న గాలి కుటుంబం ఆ వీడియోలో కనిపిస్తుంది. 
 
బ్రహ్మణి వెడ్స్ రాజీవ్ రెడ్డి అనే వధూవరుల పేర్లతో ఈ వీడియో మొదలవుతుంది. ఈ వీడియో ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటోంది. అతిథి దేవోభవ అంటూ మొదలయ్యే ఈ వీడియో సాంగ్‌ జనార్దన రెడ్డి తన కుమార్తె వివాహ తేదీని.. వేదికను చెప్పడంతో ముగుస్తుంది.  పెళ్లి కార్డుతోనే ఇంత హంగామా చేసిన గాలి కూతురి పెళ్లిని ఇంకెంత ఘనంగా చేస్తారో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments