వినాయక చవితి... 108 ఉండ్రాళ్లతో పూజ.. ఇలా చేస్తే?

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (11:29 IST)
మనిషి జీవితంలో తమ కార్యక్రమాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న సమయానికి పూర్తి కావాలని అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి కోరికలు నెరవాలంటే విఘ్నాలను తొలగించే వినాయకుని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
విఘ్నరాజు ఆటంకాలు తొలుగుతాయని ఆ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసేలా చూస్తాడని అలాగే శుభ ఫలితాలు పొందుతారని విశ్వాసం. గణపతిని ఆరాధించటం వలన మనిషి జీవితంలోని అన్ని విషయాలలో ఆనందం శ్రేయస్సు విజయం పొందుతారు. వినాయకుని పూజించడం వలన సాధకుడికి మంచి బుద్ధి బలం కూడా వస్తుంది.
 
వినాయకుడిని పూజించటం వలన ఒక మనిషి తన శక్తులను పొందుతాడని అలాగే ఏ పనులైనా ముందుకి సాగే విధంగా ఆయన అనుగ్రహిస్తాడు. వినాయకుడు తన భక్తుల కష్టాలను దుఃఖాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. సనాతన సంప్రదాయంలో ఆది పూజ్యుడు గణేశుడు.. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడిని తప్పక పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
భాద్రపద శుద్ధచవితి రోజున వచ్చే వినాయక చవితి నాడు సూర్యోదయం కంటే ముందే లేవాలి. శుచిగా అభ్యంగ స్నానమాచరించి పూజా మందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులతో అలంకరించుకోవాలి. 
 
ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు ధరించి పూజకు ఉపయోగపడే వస్తువులు, పటములకు గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి. ఆకుపచ్చ రంగు వస్త్రమును కప్పిన కలశమును, వినాయకుడి ఫోటో లేదా శ్వేతార్క గణపతి ప్రతిమను పూజకు సిద్ధం చేసుకోవాలి. 
 
పసుపురంగు అక్షతలు, కలువ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి మాలలతో గణపతిని అలంకరించుకోవాలి. నైవేద్యానికి ఉండ్రాళ్ళు, బూరెలు, గారెలు, వెలక్కాయ వంటివి తయారు చేసుకోవాలి.
 
దీపారాధనకు రెండు కంచు దీపాల్లో ఏడు జిల్లేడు వత్తులను వేసి కొబ్బరినూనెతో దీపం వెలిగించాలి. వినాయక చతుర్థి నాడు సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు, మానసిక సంతృప్తి లభిస్తాయి. అలాగే ఆలయాల్లో 108 ఉండ్రాళ్లతో పూజ, గణపతి ధ్యానశ్లోకం, గరికతో గణపతి గకార అష్టోత్తరం, గణేశ నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తే వంశాభివృద్ధి, సకలసంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. 
 
అలాగే మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు గణపతి స్తోత్రమాల, గరికతో గణపతి పూజ, శ్రీ గణేశారాధన, శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతాయని అంటారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments