మీల్‌‌‌‌‌మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు మీల్‌ మేకర్‌ - ఒక కప్పు ఉల్లిపాయలు- రెండు పచ్చిమిర్చి- రెండు అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్ పసుపు - చిటికెడు కారం - 2 స్పూన్స్ పుదీనా -

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (13:59 IST)
కావలసిన పదార్థాలు: 
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు 
మీల్‌ మేకర్‌ - ఒక కప్పు  
ఉల్లిపాయలు- రెండు 
పచ్చిమిర్చి- రెండు 
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్ 
పసుపు - చిటికెడు 
కారం - 2 స్పూన్స్ 
పుదీనా - కొద్దిగా 
కొత్తిమీర - 2 స్పూన్స్ 
బిర్యానీ ఆకు - ఒకటి 
యాలకులు - రెండు 
లవంగాలు - రెండు 
దాల్చినచెక్క - అంగుళం ముక్క 
నూనె లేదా నెయ్యి- 1 స్పూన్ 
ఉప్పు - తగినంత 
నీళ్లు - తగినన్ని 
 
తయారీ విధానం:
ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే వేడినీటిలో మీల్‌ మేకర్‌, కొద్దిగా ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పడు బాణలిలో సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేగించి మసాలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. తరువాత నీరు మొత్తం పోయేలా మీల్‌మేకర్‌ను చేతులతో పిండాలి. ఆ మీల్‌మేకర్‌లో కొద్దిగా ఉప్పు, కారం, మసాలా వేసి కలిపిపెట్టుకోవాలి. 
 
బాణలిలో నూనె పోసి వేడయ్యాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేగించాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మీల్‌ మేకర్‌ వేసి మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తరువాత కొత్తిమీర, పుదీనా, బాస్మతి బియ్యం వేసి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించి దించేయాలి. అంతే వేడివేడి మీల్‌మేకర్ బిర్వానీ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments