వేసవికాలంలో దహీ వడను తీసుకుంటే.. ఆరోగ్యానికి ఢోకా లేదు...

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (13:43 IST)
పెరుగు వేసవికాలంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగును నేరుగా తీసుకోవడం కంటే, అందులో నీరు కలిపి బాగా చిలికించి లేదా మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసి అదులో నీరు ఎక్కువగా పోసి తీసుకోవడం వల్ల వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. ప్రత్యేకంగా వేసవిలో తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. అలాంటి పెరుగుతో దహి పూరీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
మినపప్పు - పావు కేజీ 
చాట్ మసాలా - ఒక స్పూన్ 
వెల్లుల్లి తరుగు - ఒక కప్పు 
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
టమోటా తరుగు - అర కప్పు
బంగాళాదుంప తురుము - పావు కప్పు 
స్వీట్ పెరుగు - రెండు కప్పులు
ఉప్పు- తగినంత 
 
తయారీ విధానం.. 
ముందుగా రాత్రి మినప్పప్పును నానబెట్టాలి. మరుసటి రోజు బాగా మెత్తగా రుబ్బి, ఉప్పు కలిపి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక ఈ పిండిని చిన్నచిన్న గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించి తీసి నీళ్లలో వేసి ఒక నిమిషం నానబెట్టి తీసేయాలి. ఒక పాత్రలో పెరుగు వేసి చిక్కగా చిలకరించి, అందులో ఉప్పు, పంచదార, జీరాపొడి, మిరప్పొడి వేసి కలిపి, వేయించి ఉంచుకున్న గారెలను ఇందులో వేయాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు, అల్లం తురుములు, టమోటా తరుగు, వెల్లుల్లి తరుగు, చాట్ మసాలా పైన చల్లాలి. చివరిగా పుదీనా చట్నీలతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి. దహీ వడ రెడీ అయినట్లే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైలులో సీటు ఇవ్వలేనపుడు చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారు? బీహారీ మహిళ ప్రశ్న

అక్రమాస్తుల కేసు : అసిస్టెంట్ కమిషనర్ శాంతికి పోలీస్ కస్టడీ

తండ్రి శవాన్ని పక్కనబెట్టుకుని సంతకాలు సేకరించిన జగన్ : మంత్రి అచ్చెన్నాయుడు

Vijay cycle yatra, అభిమాని పూలచెండు వేస్తే బాంబు వేశాడేమోనని సైకిలి వదిలేసి విజయ్ పరుగో పరుగు, వీడియో

భార్యను కాపురానికి పంపడంలేదని అత్తకి కరెంట్ షాక్ ఇచ్చిన అల్లుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Supriya : డెకాయిట్‌ క్లైమాక్స్ రిస్క్ అనిపించలేదు : సుప్రియ యార్లగడ్డ

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ ఈతరం జెన్ జీ కిడ్స్ కు బాగా నచ్చుతుంది : వి. మునిరాజు

ఆప్ క్యూట్ హో... మోడల్ తాన్యా ఛటర్జీకి చాహల్ మెసేజ్ (Video)

Suma: రాజీవ్ ఐక్యూ వర్సెస్ సుమ జీబీ పేరుతో టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో సుమ, రాజీవ్

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

తర్వాతి కథనం
Show comments