Webdunia - Bharat's app for daily news and videos

Install App

దృష్టిలోపాలను తరిమికొట్టే క్యారెట్‌తో చట్నీ ఎలా చేస్తారో తెలుసా?

క్యారెట్ దృష్టిలోపాలను దూరం చేస్తుంది. క్యారెట్లో బీటా-కెరోటిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. యాంటీయాక్సిడెంట్ ఏజెంట్‌గా పనిచేసే క్యారెట్‌లో విటమిన్ ఎ, సి, కె, విటమిన్ బి8, పొటాషియం ఐరన్, కాపర్ వంటి బోలెడ

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (13:59 IST)
క్యారెట్ దృష్టిలోపాలను దూరం చేస్తుంది. క్యారెట్లో బీటా-కెరోటిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. యాంటీయాక్సిడెంట్ ఏజెంట్‌గా పనిచేసే క్యారెట్‌లో విటమిన్ ఎ, సి, కె, విటమిన్ బి8, పొటాషియం ఐరన్, కాపర్ వంటి బోలెడన్నీ పోషకాలున్నాయి. అలాంటి క్యారెట్‌‍తో  హల్వా, వేపుడు వంటివే కాకుండా చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం.. 
 
కావలసిన పదార్థాలు :
క్యారెట్ - పావు కేజీ 
ఎండు మిర్చి - ఆరు 
చింతపండు - నిమ్మకాయంత 
కరివేపాకు- తాలింపుకు తగినంత 
మినపప్పు- 4 స్పూన్లు 
కొత్తిమీర - రెండు స్పూన్లు 
ఆవాలు, నూనె - పోపుకు తగినంత 
 
తయారీ విధానం : 
బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండును కూడా చేర్చి ఐదు నిమిషాల పాటు వేపాలి. వీటిని ఓ ప్లేటులోకి తీసుకుని ఆరబెట్టాలి. అదే బాణలిలో క్యారెట్ తురుమును ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి.

ఆరాక మిక్సీలో ముందుగా ఎండుమిర్చి మిశ్రమాన్ని, ఆపై క్యారెట్ తురుమును ఉప్పు చేర్చి రుబ్బుకోవాలి. తర్వాత స్టౌమీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె, ఆవాలతో పోపు పెట్టి.. రుబ్బుకున్న చట్నీకి కలిపి రెండు నిమిషాల పాటు వేపాలి. అంతే క్యారెట్ చట్నీ రెడీ. ఈ చట్నీని వేడి వేడి దోసెలు, ఇడ్లీలకు సైడిష్‌గా తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments