Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్నేయం దిశ వాస్తు ప్రకారం వుంటే సరే.. లేకుంటే మాత్రం?

Money plant
సెల్వి
సోమవారం, 8 జులై 2024 (19:27 IST)
ఆగ్నేయంలో వాస్తు సరిగ్గా ఉంటే అన్నీ శుభాలే. అయితే ఆగ్నేయం దిశలో వాస్తు దోషాలు ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిగతా అన్ని దిశల కంటే ఆగ్నేయ దిశ పై అత్యంత సూక్ష్మంగా శ్రద్ధ వహించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయ దిశ ఇంట్లో డబ్బు ప్రవాహానికి సంబంధించింది. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ దిశలో ఉంటుంది.

ఆగ్నేయంలో వాస్తు సరిగ్గా ఉంటే భార్యకు భర్తపై ప్రేమ, భర్తకు భార్యపై ప్రేమ పుష్కలంగా ఉంటుంది. కానీ ఆగ్నేయంలో నైరుతి కంటే ఎత్తు పెరిగినా, గోతులున్నా, ద్వారం ఉన్నా దోషమే. ఈ దిశలో నీలం లేదా నలుపు రంగు ఉండకూడదు. బోరింగ్ లేదా భూగర్భ నీటి ట్యాంక్ ఉండకూడదు. పసుపు రంగు ఉండకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
ఒకవేళ ఆగ్నేయంలో ఏదైనా వాస్తు దోషం వుంటే.. ఇలా పరిష్కరించుకోవచ్చు. ఇంట్లో మరొక అత్యంత అనుకూలమైన మనీ ప్లాంట్ దిశ ఆగ్నేయం. ఇది లక్ష్మీ దేవిని సూచిస్తుంది. ఇది శ్రేయస్సు, సంపదకు కారణమవుతుంది. ఈ దిశకు శుక్రుడు పాలకుడు. 
Vastu purush
 
ఆగ్నేయంలో వాస్తు దోషాలు వున్న వారు మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఇంట్లోకి డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. మనీ ప్లాంట్‌ను గోధుమ లేదా ఎరుపు రంగు కుండలో ఉంచి, వాటర్ బాటిల్‌కు బదులుగా మట్టిలో పాతుకుపోయేలా పెంచాలి. కానీ మనీ ప్లాంట్‌ను నైరుతి దిశలో లేదా పశ్చిమాన పూర్తిగా ఉంచకూడదు. ఎందుకంటే అవి జీవితం, సంబంధాలు మరియు వృత్తిలో అస్థిరతకు దారితీయవచ్చునని వాస్తు శాస్త్రం చెప్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments