Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంగిలితో చేతి వేళ్లను తడిపి డబ్బును లెక్కిస్తున్నారా?

Advertiesment
Money

సెల్వి

, సోమవారం, 24 జూన్ 2024 (19:17 IST)
Money
ద్రవ్యం, డబ్బు శ్రీలక్ష్మీ స్వరూపం. అలాంటి డబ్బుకు మర్యాద ఇవ్వడం చేయాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు అంటున్నారు వాస్తు నిపుణులు అంటున్నారు. డబ్బుకు సంబంధించిన కొన్ని తప్పులు చేస్తే, జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం ఖాయమని వాస్తు శాస్త్రం చెప్తోంది. 
 
ముందుగా ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు లక్ష్మీదేవిని ఆరాధించడం మరిచిపోకూడదు. లక్ష్మీదేవి ఆరాధనతో డబ్బు కొరత రాదు. అలాగే విష్ణువు, లక్ష్మి దేవిని ప్రతిరోజూ పూజిస్తే ఈతిబాధలు వుండవు. అయితే ఈ తప్పులు చేస్తే జీవితంలో ఆర్థిక చిక్కులు ఎదుర్కోక తప్పదని వాస్తు శాస్త్రం చెప్తుంది. 
 
ఎంగిలితో తడిపి డబ్బును లెక్కించకూడదు.. ఎంగిలితో వేళ్ళను తడిపి డబ్బును లెక్కించకూడదు. ఇది లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు లెక్క. ఇంకా డబ్బుని మడతపెట్టకూడదు. పర్సులో కూడా డబ్బును మడతపెట్టి వుంచరాదు. 
 
అలాగే ఎక్కడ పడితే అక్కడ డబ్బును ఉంచకూడదు: కొంతమంది డబ్బును ఎక్కడపడితే అక్కడ వుంచుతారు. అలా చేయడం తప్పు. ఇది ప్రతికూల ప్రభావాన్నిస్తుంది. 
 
ఇతర వస్తువులను ఉంచడం: డబ్బు ఉంచే స్థలంలో ఇతర వస్తువులను ఉంచడం సరైనది కాదు. 
తలకు దగ్గర ఉంచుకోకూడదు: రాత్రి నిద్రపోయేటప్పుడు దిండుకింద, తలకు దగ్గర డబ్బును ఉంచుకొని నిద్రపోకూడదు. డబ్బు ఉంచే స్థలంలో మాత్రమే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-06-2024 - సోమవారం... ఇతరులతో అతిగా మాట్లాడటం వద్దు