సంతానలేమితో బాధపడుతున్నారా.. అందుకు కారణం..?

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (10:41 IST)
సాధారణంగా అనేక జంటలు సంతాన లేమితో బాధపడుతుంటాయి. ఇలాంటి వారికి ఇంట్లోని వాస్తు దోషం వలనే సంతాన భాగ్యం లేదనే సందేహం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇదే విషయంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. కింది విధంగా చెప్తున్నారు. 
 
ప్రధానంగా ఈశాన్యం జననానికి, నైరుతి మరణానికి సంకేతాలు అనేవి వాస్తులో శాస్త్రవేత్తలు చెప్పుకునే సామెతలు. ఈశాన్యంలో లోపం ఉన్నప్పుడు పుత్ర సంతానం లేకపోవడం, ఒకవేళ ఉన్నా దూరం కావడం జరుగుతుంటాయి. అలానే ఈశాన్యం మూతపడి ఉండడం ఇంటికి ఈశాన్యం తెగిపడి ఉండటం, నైరుతిలో బావి ఉండటం, ఇలాంటి కారణాలు వంశ అభివృద్ధికి విఘాతాన్ని కలిగిస్తుంటాయి. 
 
అలాంటి గృహంలోని సభ్యులు మంచి వాస్తున్న ఇంట్లోకి వెళితే సంతానం కలుగుతుందా అనే సందేహం కలుగుతుంది. నిజమే సంతానం కలిగే అవకాశం ఉంది. ఐతే, ఈశాన్య లోపం ఉన్న గృహంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్న దానిపై వారి ఆరోగ్య క్షీణతలో వచ్చిన మార్పులపై కొత్త ఇంటి ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశముంటుందని వాస్తునిపుణులు చెప్తున్నారు. 
 
ఒక ప్రదేశం మనిషి భావాలను, ఆవేశాలను నియంత్రించినట్టుగా ఈశాన్య, నైరుతి దశలు సక్రమమైనప్పుడు పురుష వీర్యశక్తిని కూడా పునరుద్ధరింపజేస్తాయి. ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే కొత్త ఇల్లు తూర్పు, ఈశాన్య సింహద్వారమై ఉండవలసిన అవసరముంది. 
 
దక్షిణ, పశ్చిమ దిశల్లో గృహాలు ఉండి ఈశాన్యం బ్లాక్ అయిన వాస్తు ఇంటిలోకి చేరితే ఆ ఇంటి దిశల డిగ్రీ సుమారు నూరు శాతం ఉంటే మంచి ఫలితాలు వస్తాయని వారు సూచిస్తున్నారు. కొత్త ఇంట్లో చిన్న పిల్లల బొమ్మలను పడకగదిలో పెట్టుకుని తూర్పు వైపు తలపెట్టి ఆలుమగలు నిద్రించాలి. ఆత్మ సంకల్పం, దిశ ప్రభావం ద్వారా ఆలస్యంగానైన సంతానం చక్కగా కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

తర్వాతి కథనం
Show comments