నేటి తరుణంలో గృహ నిర్మాణాలు ఎక్కువైపోతున్నాయి. ఇంటి కట్టడం ప్రారంభించినా ఆ గృహంలో ఎన్ని పడక గదులు కట్టుకోవాలో తెలియక తెగ ఆలోచిస్తుంటారు. ఒకవేళ మూడు పడక గదులు కట్టుకుంటే.. అవి దక్షిణంలోనే ఉండాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించడం మంచిదంటున్నారు. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
పడక గదులు ఎన్ని ఉన్నా ఇబ్బంది లేదు. అవసరాన్ని బట్టి కట్టుకోవచ్చు. సంఖ్య ప్రధానం కాదు. అయితే అన్నీ గదులు దక్షిణంలో, నైరుతిలో ఉండరాదు. శయన మందిరం అనేది అతి వేడిగా, అతి చల్లగా ఉండకుండా నిర్మించడం ముఖ్యం. నిజానికి పడక గదులకు ప్రహరీలకు అత్యంత గొప్ప సంబంధం ఉంటుంది. ప్రహరీలు సమదూరం, సమ ఎత్తు దానిని అనుసరిస్తూ చెట్లు ఉన్నప్పుడు పడక గదులు సహజసిద్ధ నిద్ర గదులుగా ఉండగలవు.
పడమర, దక్షిణం రెండు దిశలను సమపట్టుగా విభజించి మూడు పడక గదులను ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఉత్తర వాయవ్యం దక్షిణ నైరుతి పడమరలో పడక గదులు కట్టుకోవచ్చు. వాటికి మంచి గాలి వెలుతురు వస్తుంది. పడమరలో ఇంటికి బాల్కనీ రెండు లేదా మూడు ఫీట్లు ఉండడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే ఆ గదుల తీవ్ర ఉష్ణోగ్రతను నియంత్రివచ్చు. ఇంటికి రెండువైపులా చెట్లు పెంచుకుంటే మంచిది. అప్పుడే పడక గదులు ఆరోగ్యంగా ఉంటాయి.