వంట గదిని ఏ దిశలో ఏర్పాటు చేయాలి..?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:50 IST)
వంటగది ఆగ్నేయ మూల ఉండడం మంచిది. ఒకవేళ అలా సాధ్యం కాని సందర్భంలో ఇంటికి వాయువ్య మూలన ఉంచడం మంచిది. వాయవ్యంలో వంట చేయడం వలన ఇంట్లో కొంత ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంది. అయితే వారికి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అలానే సమాజంలో మంచి మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంది. 
 
వంటగట్టు తూర్పు లేదా ఉత్తర గోడను అంటుకోకుండా చూసుకోవాలి. అలానే స్టౌ బయటకు కనిపించేలా పెట్టుకోవడం మంచిది కాదు. అలానే స్టౌకు దగ్గరలోనే పంపులు, సింకులు ఉండకుండా చూసుకోవాలి. అగ్ని, జలం రెండూ పరస్పర విరుద్ధ పదార్థాలు. వంటగదిలో అల్మరాలు ఈశాన్య దిక్కున ఉంటే అందులో తేలికపాటి వస్తువులను మాత్రమే పెట్టుకోవాలి.
 
అటకలు ఎప్పుడూ వంటగట్టుపై ఉండరాదు. వంటగదిలో పెద్ద కిటికీలు తూర్పు దిక్కున, చిన్నవి దక్షిణ దిక్కున ఉండేలా చూసుకోవాలి. వంటగదిలో పెద్ద కిటికీలు తూర్పు దిక్కున, చిన్నవి దక్షిణ దిక్కున ఉండేలా చూసుకోవాలి. వంటగదికి అనువైన రంగులు ఆకుపచ్చ, లేత గులాబీ, నారింజ. వంట గదిలో నీళ్ల పొయ్యికి వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టాలి. వంటగదికి రెండు కిటికీలు పెట్టడం వలన మంచి ఫలితాలు చేకూరుతాయి. 
 
వంటగదిలో నిత్యావసర వస్తువులను వంటకి సంబంధించిన ఇతర సామాగ్రిని పడమర వైపు అలమారాల్లో పెట్టుకోవాలి. మిక్సీలు, గ్రైండర్స్, ఓవెన్.. మెుదలగు ఎలక్ట్రికల్ వస్తువులను వంటగది దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు వంటగదిలో రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేయకపోవడం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హల్లో నవనీత్ జీ... మీరు నలుగురు పిల్లలను కనండి.. ఎవరు అడ్డుకున్నారు? అసదుద్దీన్

ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన ముగ్గురు పిల్లల ప్రైవేట్ స్కూల్ టీచరమ్మ

ప్లీజ్ ఒక్కసారి రమ్మని ఇంటికి పిలిచి వివాహితను హత్య చేసిన గ్యాస్ డెలివరీ బోయ్

మహిళా కానిస్టేబుల్‌నే లైంగికంగా వేధించాడు, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు

ఏపీ పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దు.. సుప్రీంలో స్టే కోరతాం..?

అన్నీ చూడండి

లేటెస్ట్

సంక్రాంతి గీతల ముగ్గులు- రథం ముగ్గు

03-01-2026 శనివారం ఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Betel Leaf: కలలో తమలపాకులు కనిపిస్తే.. ఫలితం ఏంటో తెలుసా?

Heavy Rush: వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో పోటెత్తిన జనం

Srivari Laddus: శ్రీవారి లడ్డూ విక్రయంలో కొత్త రికార్డు.. పెరిగిన నాణ్యత, రుచే కారణం

తర్వాతి కథనం
Show comments