రెండు ద్వారాలు అలా వుంటే కళత్రపీడ...

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (22:46 IST)
ఏ దిశలో సింహద్వారం వుంచాలన్నది తెలియక చాలామంది తికమకపడుతుంటారు. ఒకే సింహద్వారం పెట్టదలచుకుంటే తూర్పు దిశ, రెండు ద్వారాలైతే తూర్పు, పడమర, ఉత్తరం దిశలు అనుకూలం. నాలుగు వైపుల ద్వారాలు ఉండటం శ్రేష్ఠం. 
 
ఏకద్వారం : తూర్పున ధనవృద్ధి. దక్షిణ దిశ జయం, పడమట ధనహాని, ఉత్తర దిశ ధన నష్టం. 
 
రెండు ద్వారాలు : తూర్పు- దక్షిణ దిశలు కళత్రపీడ, తూర్పు-పడమర పుత్రవృద్ధి, దక్షిణ- పడమరలు ద్రవ్యలాభం, తూర్పు - ఉత్తర దిశలు కష్టానష్టాలు, ఉత్తర - దక్షిణాలు శత్రుభయం, ఉత్తర - పశ్చిమాలు కీడు. 
 
మూడు ద్వారాలు : తూర్పు, పడమర, దక్షిణ దిశలు సౌఖ్యలోపం. తూర్పు, ఉత్తర, దక్షిణాలు సంపద, తూర్పు, ఉత్తర, పశ్చిమాలు అనారోగ్యం. ఉత్తర, దక్షిణ, పశ్చిమాలు కీర్తిసంపదలు. 
 
నాలుగు దిశల ద్వారాలు : సౌఖ్యం, లాభదాయకం. నాలుగు దిశలా ద్వారాలు ఉండడం అన్నివిధాలా శ్రేయస్కరం. ద్వారాలు సరిసంఖ్యలో వుండాలి.
 
ఇదేవిధంగా కిటికీలు, దూలాలు, అలమర్లు సరిసంఖ్యలో వుండాలి. ద్వారాలు, కిటికీలు, అలమరలు ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి. సింహద్వారానికి రెండు పక్కల కిటికీలు వుండాలి. దక్షిణ పశ్చిమ దిశలలో కిటికీలు విధిగా వుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి ఓటర్ల పేర్లను తొలగించడమే 'సర్' ఏకైక లక్ష్యం : ఎన్నికల సంఘం

పనిమనిషిని గర్భవతి చేసిన బంగారు వ్యాపారి కుమారుడు... ఎక్కడ?

పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా : మహిళా టీచర్‌కు వ్యక్తి బెదిరింపు

బీమా సొమ్ము కోసం సెలైన్‌లో విషం కలిపి హత్య చేసిన భార్య

మైసూరు పబ్‌లో మంటలు... ఇద్దరు కార్మికులు సజీవ దహనం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments