వాస్తు టిప్స్: ఉదయం నిద్ర లేవగానే వాటిని చూస్తే అంతేసంగతులు

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (12:00 IST)
వాస్తుశాస్త్రం ప్రకారం ఉదయం పూట గడియారం వైపు చూడకూడదు. అలాగే ఉదయం పూట సూదులు, దారాలు చూడకూడదు. ఈ విషయాలను అరిష్టంగా పరిగణిస్తారు. ఉదయం లేవగానే దీన్ని చూస్తే రోజంతా పాడైపోతుందని వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పబడింది.

 
రాత్రి పడుకునే ముందు ఇంట్లో వున్న ఎంగిలి పాత్రలన్నీ శుభ్రం చేసి పడుకోండి. ఎందుకంటే ఉదయం పూట ఆ పాత్రలో వున్న వంటలను చూడటం వలన మీకు చెడు సందేశం రావచ్చు. మీ రోజంతా ఒత్తిడికి గురవుతుంది. ఉదయం నిద్రలేవగానే చాలామంది పళ్లు తోముకుంటూ అద్దంలో చూసుకుంటూ వుంటారు. ఇలా అస్సలు చేయవద్దు. ఎందుకంటే అద్దంలో చూసుకుంటే నెగెటివ్ ఎనర్జీని ఆకర్షించినట్లవుతుంది. రోజంతా ఆలోచనల్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది.

 
ఉదయం నిద్ర లేవగానే మీ నీడను, మరొకరి నీడను చూడకండి. ఉదయం నిద్రలేచిన తర్వాత మీకు నీడ కనిపిస్తే, అది మీ రోజంతా ప్రభావితం చేస్తుంది. మీరు రోజంతా ఒత్తిడి, భయం, కోపం అనుభూతిని చెందుతారు. కాబట్టి మంచం మీద నుంచి లేచిన తర్వాత నీడ వైపు చూడకండి.

 
ఉదయం నిద్రలేవగానే ముందుగా అరచేతిని చూసుకుని గాయత్రీ మంత్రం లేదా మరేదైనా మంత్రాన్ని జపించడం శుభప్రదం. అలాగే, మీరు మంచం మీద నుండి లేచి, దేవుని ఫోటో, నెమలి కళ్ళు, పువ్వులు మొదలైన పాజిటివ్ విషయాలను చూసినప్పుడు, ఆ రోజు చక్కగా సాగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని.. మనస్తాపంతో ....

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు : దర్యాప్తునకు సాయం చేసేందుకు ఆసక్తి చూపిన అమెరికా.. నో చెప్పిన భారత్

ఆంధ్రప్రదేశ్‌లో రూ.82వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న రీన్యూ పవర్

ఢిల్లీ కారు బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వైద్యుడు ఉమర్ నబీ

అన్నీ చూడండి

లేటెస్ట్

11-11-2025 మంగళవారం ఫలితాలు - ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధికి ప్రవేశించుటకు ముందు రోజు రాత్రి ఏం జరిగింది?

శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని

Non Veg Food Near Alipiri: అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారు.. ఇద్దరు ఉద్యోగులు అవుట్

10-11-2025 సోమవారం ఫలితాలు - కొత్త వ్యక్తులతో జాగ్రత్త

తర్వాతి కథనం
Show comments