Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తు శాస్త్రం: మనీ ప్లాంట్‌తో ఆ మొక్కను కూడా పెంచాలట...

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (16:39 IST)
Money Plant
ఇంట్లో మనీ ప్లాంట్  పెంచుతున్నారా? అయితే ఈ  మొక్కను కూడా పెంచడం మరిచిపోకండి అంటున్నారు వాస్తు నిపుణులు. ఇలా చేస్తే అదృష్టం వరిస్తుంది. మనీ ప్లాంట్‌ను గాజు లాంటి కంటైనర్‌లో పెంచితే అదృష్టం వరిస్తుంది. 
 
తెలుపు, లేత నీలం, ఆకుపచ్చ రంగులో ఉన్న సీసాలలో మనీ ప్లాంట్‌ను పెంచడం ద్వారా అదృష్టం వరిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
 
గంట మొక్కను కుండీలో పెంచడం కంటే బాటిళ్లు లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో పెంచితే మంచి అదృష్టం వెంటే వుంటుంది. మనీ ప్లాంట్‌కు సంబంధించినంత వరకు, దీనికి చాలా సూర్యరశ్మి అవసరం లేదు. కాబట్టి ఇంటి లోపల కూడా మనీ ప్లాంట్ పెంచవచ్చు.
 
మనం ఉదయాన్నే నిద్రలేచి ఈ మనీ ప్లాంట్ ఆకుపచ్చని ఆకులను ముందుగా చూడటం చేస్తే పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. నిద్రలేచిన వెంటనే మనీ ప్లాంట్‌ను చూస్తే ఆ రోజు మనకు అదృష్టం కలిసివస్తుందనీ, కోరుకున్నది జరిగిపోతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
ఈ విధంగా మనీ ప్లాంట్‌ను పెంచే వారు అందులోని నీటిని తరచూ మార్చాలి. కొన్ని మొక్కలను ఒంటరిగా పెంచకూడదని వాస్తు నిపుణులు చెబుతారు. అలా మనీ ప్లాంట్‌తో పాటు పెంచాల్సిన ఒక మొక్క ఉంటే అది తమలపాకు. మనీ ప్లాంట్‌తో పాటు తమలపాకును పెంచితే మనకు అదృష్టం కలిసివస్తుంది. 
 
తమలపాకు చెట్టును మనీ ప్లాంట్ ఉంచిన ప్రదేశానికి దగ్గరగా నాటండి. తమలపాకులు వచ్చినప్పుడు మనకు సంపద లభిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మనీప్లాంట్‌తో పాటు తమలపాకును కూడా పెంచండి. మనం ఎప్పుడూ తమలపాకును ఒంటరిగా పెంచకూడదు. 
 
కాబట్టి ఇలా మనీ ప్లాంట్‌తో పాటు తమలపాకును పెంచినప్పుడు, మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ విధంగా పెరగడం, ముఖ్యంగా ఆఫీసుల్లో, పురోగతిని తెస్తుంది. ఇంట పెంచినప్పుడు వాస్తు దోషాలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

తర్వాతి కథనం
Show comments