Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పబ్జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపిన తనయుడు

Advertiesment
gun shot
, శుక్రవారం, 10 జూన్ 2022 (14:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పబ్జీ గేమ్ ఆడనివ్వలేదన్న కోపంతో కన్నతల్లిని తండ్రి రివాల్వర్‌తో కాల్చి చంపాడో తనయుడు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు తన స్నేహితుడి సాయం కోరడమే కాకుండా అతిని ఐదు వేల రూపాయలను ఆఫర్ కూడా చేశాడు. ఈ దారుణం ఐదు రోజుల క్రితం జరిగింది. 
 
యూపీలోని లక్నోకు చెందిన సాధన (40) అనే మహిళకు 16 యేళ్ల బాలుడు ఉన్నాడు. పజ్ జీ మొబైల్ గేమ్ ఆడకుండా అడ్డుకుంది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ బాలుడు.. తల్లిని కాల్చి చంపాడు. మూడు తర్వాత తర్వాత మృతదేహం నుంచి దుర్వాస రావడంతో కోల్‌కతాలో పని చేస్తున్న ఆర్మీ ఉద్యోగి అయిన తన తండ్రికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆ బాలుడు వద్ద విచారణ జరపగా పబ్జీ గేమ్ ఆడొద్దని చెప్పడంతోనే కాల్చి చంపినట్టు అంగీకరించాడు. తల్లి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తరలించేందుకు స్నేహితుడి సాయాన్ని కోరడమే కాకుండా  రూ.5 వేల నగదు కూడా ఆఫర్ చేశానని చెప్పాడు. పైగా, ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని రివాల్వర్‌తో స్నేహితుడిని కూడా బెదిరించాడు. దీంతో ఈ హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుందర్ పిచాయ్ పుట్టినరోజు.. తండ్రి ఏడాది జీతంతో యూఎస్ ఫ్లైట్ ఎక్కాడు...