ఆ రెండు వారాల్లో బల్లి క్రింద పడితే? లాభాలేంటి? (Video)

సాధారణంగా ప్రతి ఇంట్లో గోడలపై బల్లులు పాకుతా ఉంటాయి. ఈ బల్లులు గోడలపై ఉండేవి తినడానికి ప్రాకులాడుతుంటాయి. బల్లి ఎప్పుడైనా క్రింద పడడం సహడజం. ప్రమాదవశాత్తు బల్లినితాకినా, అది మీద పడినా వెంటనే స్నానం చే

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (15:31 IST)
సాధారణంగా ప్రతి ఇంట్లో గోడలపై బల్లులు పాకుతా ఉంటాయి. ఈ బల్లులు గోడలపై ఉండేవి తినడానికి ప్రాకులాడుతుంటాయి. బల్లి ఎప్పుడైనా క్రింద పడడం సహజం. ప్రమాదవశాత్తు బల్లిని తాకినా, అది మీద పడినా వెంటనే స్నానం చేస్తే ఆ దోషం తొలగిపోతుంది. అలాగే కాంచీపురం క్షేత్రంలో గల వెండి బల్లిని, బంగారు బల్లిని పూజించి వచ్చిన తరువాత బల్లి వలన కలిగే దోషాలు తొలగిపోతాయి.
 
ఇంటి మధ్యభాగంలో గురు, శుక్రవారాలు మినహా మిగిలిన ఏ వారంలోనైనా బల్లి క్రిందపడినా చాలా శ్రేయస్కరం. ఇంటిలోని తూర్పుభాగంలో ఆది, గురువారాలు మినహా మిగతా అన్ని వారాల్లో బల్లిపడడం, పలకటం శుభప్రదం. ధనలాభం కలుగుతుంది. సోమ-మంగళ, బుధవారాలు తప్పక మిగిలిన వారాలలో దక్షిణ దిక్కునందు కలిగిన సుఖము- భూషణ ప్రాప్తి, సోమ, మంగళ, బుధ, శనివారాలు మినహా వారాల్లో నైరుతి దిక్కుగా శకునం కలిగినట్లైతే సర్వకారకసిద్ధి, బంధు దర్శనం కలుగును.
 
ఆది, బుధ, గురువారాలు కాక మిగిలిన వారాలలో ఇంట్లో పడమర దిక్కుగా శకునం కలిగిన అనుకూలత్వం, నూతనవస్త్రప్రాప్తి. సోమబుధశుక్రవారాలు తప్ప మిగిలిన వారాల్లో ఇంట్లో వాయువ్య దిక్కునందు శకునం కలిగినట్లైతే శుభవార్తలు, స్త్రీ సల్లాపం, ఆనందం కలుగును. 
 
ఆది, మంగళ, గురు, శుక్రవారాలు కాక మిగిలిన వారాల్లో ఇంట్లో ఉత్తరదిక్కుగా శకునం కలిగిన సుఖము, లాభము, ప్రియవార్తలు వినుట జరుగును. బుధ, శుక్ర, శనివారాలు మినహా మిగిలిన వారాల్లో ఇంట్లోని ఈశాన్య భాగంలో శకునం కలిగిన యెడల లాభం, వాహనప్రాప్తి, కలిసివచ్చుట జరుగును. ఇంటికి పైభాగంలో బల్లి పలుకు వినిపించిన యెడల జయము, ప్రయాణంలో శుభం జరుగునని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీడియో చూడండి....

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

కాపురంలో కలహాలు.. సినీ ఫక్కీలో భార్య స్కెచ్.. అదృష్టం బాగుండి భర్త..?

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

కోటి సోమవారం అంటే ఏమిటి?

Brahmamgari Matam: కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు.. వెంటనే స్పందించిన నారా లోకేష్.. భక్తుల ప్రశంసలు

29-10-2025 బుధవారం దినఫలితాలు -

Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

తర్వాతి కథనం
Show comments