Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలశ పూజ ఎందుకు చేస్తారంటే?

రాగి, ఇత్తడి, వెండి లేక మట్టి పాత్రను తీసుకుని దాని నిండా నీరుపోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో నాలుగు మామిడి ఆకులు ఒక కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి మంత్రపూర్వకంగా భగవదారాధన చేసి నిలిపిన దానినే దేవతామూర్తి కలశము. దక్షిణగా దానిలో న

Advertiesment
కలశ పూజ ఎందుకు చేస్తారంటే?
, శనివారం, 30 జూన్ 2018 (10:03 IST)
రాగి, ఇత్తడి, వెండి లేక మట్టి పాత్రను తీసుకుని దాని నిండా నీరుపోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో నాలుగు మామిడి ఆకులు ఒక కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి మంత్రపూర్వకంగా భగవదారాధన చేసి నిలిపిన దానినే దేవతామూర్తి కలశము. దక్షిణగా దానిలో నవరత్నములు వేయు సాంప్రాదాయమున్నా నేడు చిల్లర నాణేలను ఉంచటం ఆచారముగా మిగిలినది. దీనిని పూర్ణకులవగాను, పూర్ణకుంభముగాను వ్యవహరిస్తున్నారు. భగవదారాధన చేసి దేవతా స్వరూపముగా శుభ సూచికంగా భావించు ఈ కలశమునకు హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉన్నది.
 
హిందువుల గృహాన సకల శుభకార్యాలకు అనగా గృహప్రవేశ ఉపనయన వివాహ గృహప్రవేశ, ఉపనయన వివాహ గృహారంభములకు ఈ కలశ స్థాసన ప్రారంభ సూచకముగా దోషములు అవాంతరములు కలుగకుండా నిరోధించు దైవశక్తిగా భావింతురు. ఈ పూర్ణ కుంభమును పెద్దలు పీఠాధిపతులు పూజనీయులకు స్వాగతము పలుకుటకు ఉపయోగిస్తారని శాస్త్రమున చెప్పబడినది. ఈ కలశ పూజ ఎందుకు చెయ్యాలంటే సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు పాల సముద్రము మీద శయనించుచున్న తరుణంలో అతని నాభి నుంచి ఒక కలువ పువ్వు ఉద్భవించినది. దాని మీద కూర్చుని ఉన్న బ్రహ్మ గోచరించెను. అంతా జలమయమై ఉన్న విశ్వములో బ్రహ్మ సృష్టి ప్రారంభించెను. ఈ సృష్టికి పూర్వ మంతయు జలమయము. ఆ జలమండలం నుండే సృష్టి ప్రారంభమైంది.
 
నీరు పవిత్రమైనవని సృష్టికి మూలమైనదిగా భావించి దీనికి ప్రాధాన్యతనిస్తున్నట్ల పురాణాలు చెబుతున్నాయి. సమస్త జీవులకు ఆధారమైనది నీరని మనకందరికీ తెలుసు. అంత పూజనీయమైనదని ముఖ్యమైనదని, ప్రధానమైనదని అనుసంకేతము నిచ్చునటుల కలశములో ఉదకము పోయుట సాంప్రదాయమైనది. దానిపై ఉంచిన కొబ్బరికాయ, ఆకులు పరిపూర్ణత్వమునకు సంకేతం దాని చుట్టూ చుట్టిన దారం ప్రేమానురాగాల బంధమునకు సంకేతము.
 
కలశమునకు పూసిన పుసుపు, కుంకుమలు సౌభాగ్యమునకు సంకేతము. ఇంత అంతరార్థమున్న కలశము అన్ని శుభమునకు మంగళకరము అను భావనను కలశస్థాపన పూజ ముందు చెయ్యాలి. ఈ కలశములోని నీరు సమస్థ పుణ్య నదుల నుండి వచ్చినదని సమస్త వేద, మంత్రముల సారమని సకల దేవతలు అందులో చేరి ఉన్నారన్న భావనతో మంత్రపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు.
 
ఈ కలశమును పూజించుటలో సకల దేవతామూర్తులను పూజించుటయే అను భావం కలుగును. ఇంత పవిత్రమైన జలము సకల అభిషేకములకు దైవకార్యములకు వాడదగినదని భావం.  క్షీరసాగర మధనం జరిగినప్పుడు పరమాత్మ ఒక కలశముతో ఉద్భవించి అందులోని అమృతమును దేవతలకు పంచెను. దాని వలన వారు మరణం వార్థక్యము నాశనములేని వారని హిందువుల నమ్మకం. ఈ జలం అనంతమైనదని హిందువుల విశ్వాసం. ఇలా పుణ్యజలముతోను, పూర్ణత్వమునకు సంకేతము కొబ్బరికాయ, పవిత్రతకు సంకేతమైన మామిడాకులు శౌభాగ్య చిహ్నములు, పసుపు కుంకుమ వేదమంత్ర మిళితమైన ఈ కలశము పూజకు పవిత్రము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం (30-06-18) దినఫలాలు - ఏ వ్యక్తికీ అతి చనువు...