Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇంట్లో డైనింగ్ హాల్ చూడ ముచ్చటగా ఉందా? ఐతే ఈ పాయింట్లు చూడండి

మనిషి ఆహారాన్ని తీసుకునేదీ కేవలం బతకడం కోసమే కాదని, మనిషి జీవన గమనంలో ఆహారం తీసుకోవడం ఒక భాగం. ముఖ్యంగా మనిషి చేసే కోటి విద్యలు కూటి కోసమేనని అందరికి తెలిసిందే. అందమైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ భోజనం చ

Webdunia
మంగళవారం, 22 మే 2018 (11:42 IST)
మనిషి ఆహారాన్ని తీసుకునేదీ కేవలం బతకడం కోసమే కాదని, మనిషి జీవన గమనంలో ఆహారం తీసుకోవడం ఒక భాగం. ముఖ్యంగా మనిషి చేసే కోటి విద్యలు కూటి కోసమేనని అందరికి తెలిసిందే. అందమైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ భోజనం చేయడం ఒక కళ అని వాస్తునిపుణులు తెలియజేశారు.
 
నేటి ఆధునిక ప్రపంచంలో భోజనం చేసే ప్రదేశాల నిర్మాణానికి ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మనకు అనుకూలంగా అతిథులకు తీపి జ్ఞాపకంగా ఉండేందుకు డైనింగ్‌హా‌‌ల‌్‌ను ఏవిధంగా రూపొందించుకోవాలో వాస్తు శాస్త్రం స్పష్టంగా పేర్కొంటుంది. ఎప్పుడైనా డైనింగ్‌హాల్ వంట గదికి సమీపంలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కిచెన్‌రూ‌మ్‌కు తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలి.
 
ఇంటి ప్రధాన ద్వారానికి సమీపంలో ఉండకూడదు. ఇలా ఉన్నట్లైతే పిల్లల ధ్యాస ఆటల మీదకు మరలుతాయి. అందువల్ల వారు చదువుల పట్ల నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. డైనింగ్‌హాల్ బాత్‌రూమ్ లేదా టాయ్‌లెట్‌కు సమీపంలో ఉండకూడదు. అలాగే మెట్లకింద గానీ, మెట్లకు ఎదురుగా గానీ భోజన గదిని ఏర్పాటు చేసుకోరాదు. ఈ గదిలో మితిమీరిన ఫర్నీచర్ కూడా ఉంచకూడదు.
 
అలాగే గదిలో ఉంచాల్సిన డైనింగ్ టేబుల్ ఆకారం, సైజు, కుర్చీల సంఖ్యను వాస్తు వివరించింది. ఈ టేబుల్ గుండ్రంగా లేదా కోడిగ్రుడ్డు ఆకారంలో ఉండేలా చూసుకుంటే శ్రేయస్కరం. అలాగే డైనింగ్ టేబుల్‌కు నాలుగు కోణాలు కన్నా ఎనిమిది కోణాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే భోజన గదిలో అందమైన, ఆకర్షణీయమైన పెయింట్‌ను వేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల అతిధులకు మంచి విందును ఇచ్చినట్లువుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments