ఇండియాలో డిజిటల్ కరెన్సీ : బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటల్ రూపీ

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:51 IST)
దేశంలో త్వరలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో ఈ డిజిటల్ కరెన్సీని వెల్లడించారు. భారత రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యాంకు ఈ డిజిటల్ కరెన్సీని తయారు చేయనుంది. దీన్ని బ్లాక్ చైనా టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుందని విత్తమంత్రి ప్రకటించారు. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న బిట్ కాయిన్, ఎథీరియం తదితర క్రిప్టో కరెన్సీలకు మూలం బ్లాక్ చైన్ టెక్నాలజీనే. ఈ సాంకేతిక పరిజ్ఞానం భద్రతా పరంగా ఎంతో పటిష్టమైనది. నకీలకు అవకాశాలు ఉండదు. భవిష్యత్ టెక్నాలజీగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. 
 
విత్తమంత్రి నిర్మలా సీతారమన్ చేసిన తన ప్రసంగంలో "డిజిటల్ కరెన్సీ (రూపీ) అన్నది మరింత సమర్థవంతమైన, చౌక కరెన్సీ నిర్వహణ విధానం కనుక బ్లాక్ చైన్, ఇతర టెక్నాలజీ సాయంతో డిజిటల్ రూపీని ఆర్బీఐ తీసుకునిరావడాన్ని ప్రతిపాదిస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు. దేశంలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే నగగు నిల్వ మరింతగా తగ్గుతుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments