అత్యాచారం చేసి జైలుకెళ్లాడు, బెయిల్ పైన విడుదల చేస్తే మళ్లీ బాలికను కిడ్నాప్ చేసి....

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:41 IST)
ప్రేమ పేరుతో ఓ బాలికను వంచించి అత్యాచారం చేసాడు ఆ కామాంధుడు. అత్యాచారం కేసులో అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన నిందితుడు జైలు నుంచి విడుదలైన తర్వాత అదే మైనర్ బాలికను మళ్లీ చిత్రహింసలకు గురిచేశాడు. నిందితుడిని 21 ఏళ్ల మయూర్ రమేష్ కోలిగా గుర్తించారు.

 
జామ్నేర్ తాలూకాలోని ఓ గ్రామంలో 17 ఏళ్ల యువతి నివసిస్తోంది. ఆమెకు మయూర్ రమేష్ కోలీతో ప్రేమ వ్యవహారం నడిచింది. ఐతే పెళ్లికి ముందే తన కోర్కె తీర్చాలన్నాడు మయూర్. అందుకు ఆమె ససేమిరా అనడంతో తన స్నేహితుడి సహాయంతో సూరత్‌లో మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు.

 
ఆమెను చెరబట్టి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలి తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మయూర్ కోలీపై అపహరణ, చిత్రహింసల కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనుమానితుడు మయూర్‌ను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేసారు.

 
బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆ నిందితుడు మళ్లీ మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. భయపడిపోయిన ఆ బాలిక మౌనం పాటించింది. అతడి వేధింపులు తీవ్ర రూపం దాల్చి ఆమె కాలిపై గాయం చేసాడు. దాంతో ఆమెను చికిత్స కోసం చేర్చగా ఆమె గర్భవతి అని తేలింది. నెలలు నిండకుండానే బాలిక ప్రసవించడంతో పుట్టిన పాప చనిపోయింది. తన పట్ల క్రూరంగా ప్రవర్తించిన అతడిపై బాలిక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం