Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ప్రాజెక్టు కింద 400 కొత్త రైళ్లు : నిర్మలా సీతారామన్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:26 IST)
వందే భారత్ ప్రాజెక్టు కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 400 రైళ్లను ప్రవేశపెడతామని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగంలోకి కీలకాంశాలను పరిశీలిస్తే, 
 
యువత వ్యాపారాలు ప్రారంభించడానికి బడ్జెట్‌పై దృష్టి పెట్టాం.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్డు నిర్మాణ సౌకర్యాలు 22,000 కి.మీలకు విస్తరిస్తాం. 
వందే భారత్ ప్రాజెక్టు కింద మూడేళ్లలో 400 రైళ్లను ప్రవేశపెడతాం. 
ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు దృష్టి సారిస్తాం. 
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. 
2022-02-01 భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. 
 
పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 9.2 శాతంగా ఉంటుందని అంచనా. 
రాబోయే 25 ఏళ్ల వృద్ధికి పునాది వేసేందుకు ఈ బడ్జెట్‌ను తయారు చేశాం. 
కరోనా మహమ్మారి తర్వాత వేగంగా కోలుకుంటున్న ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. 
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఆమె అభివర్ణించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments