Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు కోట్ల వ్యూస్ మార్క్‌ను దాటేసిన ..'రావాలి జగన్‌ కావాలి జగన్‌'

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:07 IST)
సాధారణంగా సినీ హీరోల పాటలు మాత్రమే య్యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకుంటాయి. అలాంటిది ఓ రాజకీయ నాయకుడిపై రూపొందిన పాట యూట్యూబ్‌లో భారీ రికార్డులే సొంతం చేసుకుంది. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి జనం గుండెల్లో నిలిచిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మీద రాసిన ఈ పాట ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. 
 
రావాలి జగన్‌ కావాలి జగన్‌ అంటూ ప్రజల గుండెల్లో పాతుకుపోయిన ఈ పాట ఇప్పటివరకు యూట్యూబ్‌లో రెండు కోట్లకు పైగా వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. ఈ ప్రచార గీతం విడుదలైన రోజు నుంచి తెగ వైరల్ అయ్యింది. తన రికార్డ్‌లను తానే తిరగరాసుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా యూట్యూబ్‌లో రావాలి జగన్‌ కావాలి జగన్‌ పాట 2కోట్లను క్రాస్‌ చేసేసింది.
 
మొత్తానికి ఎన్నికల వేళ విడుదల చేసిన ఈ పాట ప్రతిఒక్కరినీ మెప్పిస్తోంది. ప్రజల మనసు దోచుకున్న ఈ పాట ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments