వయస్సు పైబడినా హీరోలానా ఉన్నావే? అర్జున్‌తో రోజా (video)

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (14:18 IST)
సినీ నటుడు అర్జున్ చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. అది కూడా ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా ఇంటికి వచ్చారు అర్జున్. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్సనకు వెళుతూ చెన్నై నుంచి తిరుపతికి వస్తూ మార్గమధ్యంలో నగరిలోని రోజా ఇంటికి వెళ్ళారు. ఈ సంధర్భంగా ఆప్యాయంగా రోజాను అర్జున్ కుటుంబం పలుకరించుకుంది.
 
అప్పటి అగ్రహీరో అర్జున్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు అర్జున్. ప్రస్తుతానికి పెద్దగా సినిమాల్లో చేయకపోయినా ఆయనకు ఉండే క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఇక రోజా గురించి చెప్పాలంటారా.. అటు రాజకీయాల్లోను ఇటు సినిమాల్లో ఆమె రాణిస్తూనే ఉంది.
 
అర్జున్, రోజాలు ఇద్దరు మంచి స్నేహితులు. సినీరంగంలో ఇద్దరు కలిసి సినిమాలు చేసినప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి అర్జున్ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్సనార్థం బయలుదేరారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్సనార్థం బయలుదేరారు.
 
చెన్నై నుంచి అర్జున్ నేరుగా కారును నడుపుకుంటూ వచ్చారు. మార్గమధ్యంలో అర్జున్ నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజా ఇంటి వద్ద ఆగారు. అయితే వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన సంబాషణలు జరిగాయి. అర్జున్ అప్పుడెలా ఉన్నావో ఇప్పుడూ అలానే ఉన్నావు. వయస్సు ఏమాత్రం తగ్గలేదు. హీరోలాగా ఉన్నావంటూ రోజా చెప్పారట.
 
నీకేమైనా వయస్సు అయిపోయిందా.. నువ్వు అలాగే ఉన్నావుగా.. అందంగానే ఉన్నావు. ఫిజిక్ బాగా మెయింటైన్ చేస్తున్నావంటూ చెప్పారట అర్జున్. అర్జున్ కుమార్తె ఐశ్వర్యను చూసి రోజా ఆశ్చర్యపోయారట. నీకు ఇంత పెద్ద కుమార్తె ఉందా అంటూ ప్రశ్నిస్తే నీకూ కూతురు ఉందిగా అంటూ అర్జున్ రోజాను ఆటపట్టించారట. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments