Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింగ్ కమాండర్ అభినందన్‌కు #VirChakra అవార్డు..

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (13:40 IST)
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌కు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యున్నత ''వీరచక్ర'' పురస్కారం దక్కనుంది. పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చి, పాక్ ఆర్మీ చెరలో దాదాపు 60 గంటలు బందీగా ఉండి విడుదలైన అభినందన్‌కు వీరచక్ర గ్యాలెంట్రీ మెడల్‌తో కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. అభినందన్‌కున్న అసమాన ధైర్యసాహసాలకు మెచ్చి భారత ప్రభుత్వం ఆయన్ని వీరచక్రతో అభినందించనుంది.  
 
ఇకపోతే.. ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చిన అభినందన్ ఆ తర్వాత పాక్ ఆర్మీ చేతికి చిక్కారు. ఆ తర్వాత ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పాక్ ఆర్మీ అధికారులకు ఆయన సమాధానాలు ఇచ్చిన వీడియా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే అభినందన్ భారతదేశ హీరో అయిపోయారు. మార్చి 1న వాఘా సరిహద్దులో అభినందన్ అడుగుపెట్టిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments