Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకి మొండిచేయి? ఆ మహిళా ఎమ్మెల్యేకి మంత్రి పదవి, సమీకరణాలు మారిపోతున్నాయా..?

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (19:38 IST)
త్వరలో ఎపి కేబినెట్ విస్తరణ. పాత వాళ్ళకు స్వస్తి. కొత్త వారికి అవకాశం. ఇదే వైసిపిలో జరుగుతున్న చర్చ. అసలు మా మంత్రి పదవి పోవడం ఖాయమంటూ మంత్రుల వెనుక ఉన్న వారే బహిరంగంగా మాట్లాడేసుకుంటున్నారు. ఎందుకంటే మా మంత్రి సరిగ్గా పనిచేయడం లేదు. ఇది నాకే కాదు అందరికీ తెలుసునంటూ నవ్వేసుకుంటున్నారు.

 
మేకపాటి గౌతంరెడ్డి చనిపోక ముందువరకు మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆయన మరణం తరువాత ఇప్పుడు మరో రకమైన చర్చ జరుగుతోంది. అదే మేకపాటి గౌతంరెడ్డికి కేటాయించిన శాఖను మరో ఎమ్మెల్యేకు ఇవ్వబోతున్నారట.

 
అది ఎవరో కాదు చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీ. రజినీకి గతంలో మంత్రి పదవి దగ్గలేదు. ఎంతో ఆశగా ఉన్న ఆమెకు మొండిచేయే చూపించారు సిఎం. దీంతో రజినీ వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. కానీ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాలి కాబట్టి మిన్నకుండి పోయారు. ఎమ్మెల్యేగాను ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న రజినీపై జగన్మోహన్ రెడ్డి మంచి అభిప్రాయమే ఉందట.

 
దీంతో మహిళా కోటాలో రజినీకి పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి సిఎం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రోజాకు ఎలాగైనా మంత్రి పదవి వస్తుందని ఆమె అభిమానులు, అనుచరులు భావిస్తున్నారు. అందుకే ఆమెను ఎపిఐఐసి ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించారని కూడా అనుకున్నారు.

 
కానీ రోజాకు మంత్రి పదవి రాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారట. తన సొంత తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డికే మంత్రి పదవి ఇప్పించాలని చూస్తున్నాడట. ఇదే విషయంపై సిఎంతో కూడా పెద్దిరెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. 

 
రోజాకు ఎట్టి పరిస్థితుల్లోను మంత్రి పదవి రాకుండా చేయాలన్నదే పెద్దిరెడ్డి ఆలోచననే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీనే నమ్ముకుని ఉన్న రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందోన్న చర్చ బాగానే సాగుతోందట. మరి విస్తరణలో రోజాకి మంత్రి పదవి వస్తుందో రాదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments