Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం.. విశాల్‌ అరెస్ట్..

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (11:59 IST)
నటుడు విశాల్‌పై మళ్లీ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు అసంతృప్తులు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం వేశారు. తక్షణమే అధ్యక్ష పదివికి విశాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


ఈ నేపథ్యంలో నిర్మాతల సంఘం లెక్కల్ని సర్వసభ్య మండలి సమావేశంలో సమర్పిస్తానని విశాల్ తెలిపారు. కానీ నిర్మాతల సంఘంలో రూ.7 కోట్ల వరకు విశాల్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో విశాల్ గురువారం నిర్మాతల కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలో తమ పని చేసుకునేందుకు అనుమతి కావాలని.. తాళాన్ని పగులకొట్టి తమ పని చేసుకుంటామని చెప్పారు. అయితే ఇందుకు పోలీసులు అనుమతించలేదు. ఎవరో వేసిన తాళానికి పోలీసులు కాపలా కాస్తున్నారని విశాల్ మండిపడ్డారు. 
 
నిర్మాతల సంఘం అధ్యక్షుడి హోదాలో కార్యాలయానికి వస్తే.. ఇలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు విశాల్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరికి పోలీసులు విశాల్‌ను ఆయన తరపు వారిని అరెస్ట్ చేశారు. దొంగల్లా ఎవరో తాళం వేస్తే.. పోలీసులు దొంగలకు మద్దతు ఇస్తున్నారని విశాల్‌తో పాటు ఆయన మద్దతు దారులు తప్పుబడుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments