Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారానికి, శాకాహారానికి ఒకే గరిటె వాడితే ఎలా? సుధామూర్తి

Webdunia
బుధవారం, 26 జులై 2023 (16:46 IST)
రచయిత్రి, సామాజికవేత్త సుధామూర్తి తన ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలకు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. 'ఖానే మే కౌన్ హై' అనే యూట్యూబ్ సిరీస్‌లో ఇటీవల ఇంటర్వ్యూ ఎపిసోడ్‌లో కనిపించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య, తాను స్వచ్ఛమైన శాకాహారిని అని తెలిపారు. 
 
అయితే శాకాహారానికి, మాంసాహార వంటకాలకు చాలా ప్రాంతాల్లో ఒక గరిటెను ఉపయోగించడం తనకు ఆందోళన కలిగించే విషయమని సుధామూర్తి తెలిపారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్న సుధామూర్తి ఆహార విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట. 
 
"నేను స్వచ్ఛమైన శాకాహారిని, గుడ్లు, వెల్లుల్లి కూడా తినను, నాకు భయం ఏమిటంటే, శాఖాహారం, మాంసాహారం రెండింటికీ ఒకే చెంచా ఉపయోగించబడుతుందని, ఇది నా మనస్సును చాలా బాధిస్తుంది! " అని శ్రీమతి మూర్తి అంగీకరించారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు శాకాహార రెస్టారెంట్లను వెతుకుతానని లేదా తన భోజనాన్ని తానే సిద్ధం చేసుకుంటానని కూడా చెప్పారు. 
 
తన సొంత బ్యాగ్‌లో ఆహారాన్ని తీసుకెళ్తానని.. అలాగే సులభంగా వేడి చేయగల వంట వస్తువులను తనతో పట్టుకెళ్తానని తెలిపారు. ప్రస్తుతం శ్రీమతి మూర్తి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
కొంతమంది నెటిజన్లు ఇంటి నుండి ఆహారాన్ని తీసుకువెళ్లడం నిజంగా మంచి పద్ధతి అని అంగీకరించగా, మరికొందరు విభేదించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments