Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్‌లో సుధామూర్తికి చేదు అనుభవం.. ప్రధాని అత్తగారిని అని చెబితే.. వారు జోక్ చేశారు...

sudha murthy
, బుధవారం, 17 మే 2023 (09:22 IST)
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అర్థాంగి సుధామూర్తికి బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తాను బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అత్తగారిని అని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. పైగా, జోక్ చేస్తున్నారా అని ఎదురు హేళన చేశారు. ఇటీవల సుధామూర్తి బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవం గురించి ఆమె తాజాగా వెల్లడించారు. 
 
ఈ మధ్య తాను బ్రిటన్‌కు వెళ్లాను. అయితే, ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు చిరునామా అడిగారని చెప్పారు. బ్రిటన్‌లోనే ఉండే తన కుమారుడి అడ్రస్ సరిగా తెలియదని, దాంతో తన కుమార్తె భర్త అయిన బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ అడ్రస్ (నెంబర్ 10, డౌనింగ్ స్ట్రీట్, లండన్) ఇచ్చానని తెలిపారు. దాంతో ఆ ఇమ్మిగ్రేషన్ అధికారులు తనవైపు నమ్మలేనట్టుగా చూశారన్నారు. 
 
"నేను ప్రధాని రిషి సునక్ అత్తగారినే అని చెబుతుంటే.. వారు మాత్రం ఏంటి జోక్ చేస్తున్నారా? అని పదేపదే ప్రశ్నించారు. నేను నిజమే చెబుతున్నాను అని వారికి స్పష్టం చేశాను. అప్పటికీ వారి ముఖాల్లో సందేహాలు పోలేదన్నారు. దీనికి కారణం తన వస్త్రధారణే. నేను వారికి ప్రధాని అత్తగారిలా కనిపించలేదేమో అని సుధామూర్తి వివరించారు. కాగా, నారాయణమూర్తి - సుధామూర్తి ఏకైక కుమార్తె అక్షత మూర్తి .. రిషి సునక్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇపుడు రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ "హోల్‌సేల్ ప్యాకేజీ స్టార్" బాబుకు పెంపుడు కొడుకు.. జగన్ ఫైర్