కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

ఐవీఆర్
సోమవారం, 2 జూన్ 2025 (17:43 IST)
రీల్స్ పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో కొందరు చేస్తున్నవి చూస్తే అర్థమవుతుంది. తమిళనాడు నాగర్ కోయిల్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా కదులుతూ వెళ్తుండగా అందులో ప్రయాణిస్తున్న ఓ యువతి ప్రమాదకర రీతిలో రీల్స్ చేసింది.
 
ఫుట్ బోర్డుపై నిలబడి అనేక రకాల భంగిమలను చూపిస్తూ వాటిని వీడియో తీసింది. అది చాలదన్నట్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసారు. అంతేకాదు, ఆ వీడియో రైల్వే అధికారులు దృష్టికి సైతం వెళ్లింది. ఆమెపై కేసు కూడా నమోదు అయ్యింది. దీనితో ఆ యువతికి బుద్ధి వచ్చినట్లుంది.
 
అలా వీడియో తీయడంపై మాట్లాడుతూ... నేనేదో ఆటకాయితనంగా అలాంటి వీడియో తీసాను. దాన్ని పోస్ట్ చేసాక నాకు అర్థమైంది. అది ఎంతటి ప్రమాదకరమైనదో. అలా ఫుట్ బోర్డుపై నిలబడి కదులుతున్న రైల్లో ఫీట్స్ చేస్తే... ప్రమాదం జరిగి కాళ్లు పోవచ్చు, చేతులు పోవచ్చు అసలు మనిషే చనిపోవచ్చు. నేను చేసిన రీల్స్ పనికిమాలిన పని. దయచేసి అలాంటి పని ఎవ్వరూ చేయవద్దు. క్షమించండి" అంటూ పోస్ట్ పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments