Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొసలితో మాట్లాడిన వ్యక్తి.. నెట్టింట వీడియో వైరల్

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (14:39 IST)
crocodile
మొసలిని వేధించినందుకు గుజరాత్​ వడోదరలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్జన్​ చెరువు ఒడ్డున ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న మొసలి వద్దకు వెళ్లి ముట్టుకొని దాని ప్రశాంతత చెడగొట్టిన కారణంగా అతడిపై కేసు నమోదు చేశారు. 
 
నీటి ఒడ్డున ఉన్న మొసలి దగ్గరకు వెళ్లిన పంకజ్ పటేల్ అనే వ్యక్తి దానికి దండం పెట్టి అనంతరం ముచ్చట్లు చెప్పాడు. ఈ వీడియో వైరల్​ కావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఖొడియార్ దేవత ప్రతిరూపమనే ఉద్దేశంతో తాను మొసలిని తాకానని, అది తన కల అని పంకజ్ పోలీసులతో చెప్పాడు. ఆ దేవత వాహనం మొసలి. 
 
'సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవగానే.. వన్య ప్రాణాల రక్షణ చట్టం కింద పంకజ్ పటేల్​పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం' అని వడోదర ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ కార్తిక్ మహారాజ్ తెలిపారు. ఈ ఘటన కర్జన్ చెరువు ఒడ్డున జరిగిందని వెల్లడించారు.
 
ఆ వీడియోలో. మొసలి అతి సమీపానికి పంకజ్ పటేల్ వెళ్లినట్టు స్పష్టంగా ఉంది. ఆయన దాన్ని ముట్టుకొని దండం పెట్టి మాట్లాడాడు. ప్రాణాలకు ఏ మాత్రం భయపడకుండా సాహసం చేశాడు. ప్రజల నుంచి కాపాడతానని మొసలితోనే చెప్పాడు. అక్కడి వారు ఎంత చెప్పినా పంకజ్ మొసలి నుంచి దూరంగా రాలేదు. ​ మొసలి మరింత సమీపించాడు. 
 
ఖొడియార్ దేవత అంటూ దాన్ని చాలా సార్లు ముట్టుకున్నాడు. అయితే అతడి అదృష్టం బాగా ఉండి.. ఆ మొసలి ఏమీ అనలేదు. కనీసం బెదిరించకుండానే చెరువులోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments