Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి సెగ్మెంట్‌లోని స్కూలుకు రూ.618 కోట్ల కరెంట్ బిల్లు

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (17:52 IST)
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వారణాసిలోని వినాయక్ కాలనీలో ఉన్న ఓ పాఠశాలకు వచ్చిన విద్యుత్ బిల్లు చూస్తే గుండె గుభిల్లుమంటుంది. 
 
ఈ పాఠశాలకు ఏకంగా రూ.618 కోట్ల మేరకు కరెంట్ బిల్లు వచ్చింది. ఊహించని ఈ పెను ఉత్పాతాన్ని చూసి పాఠశాల యాజమాన్యం షాక్‌కు గురైంది. విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితంలేకపోయిందని స్కూలు సిబ్బంది వాపోతున్నారు. 
 
పైగా, ఈ మొత్తాన్ని ఈ నెల ఏడో తేదీలోపు చెల్లించని పక్షంలో పాఠశాలకు కరెంట్ కట్ చేస్తామంటూ విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై ఈబీ అధికారులను వివరణ కోరగా, సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగానే ఈ పొరపాటు జరిగివుంటుందని అభిప్రాయపడ్డారు. ఆ స్కూలుకు తప్పుడు కరెంటు బిల్లులు రావడం ఇదే ప్రథమం కాదనీ, గతంలోనూ ఇదే విధంగా వచ్చిందని వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments