చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి : ఉండవల్లి

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిజాలు చెప్పాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (11:51 IST)
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిజాలు చెప్పాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను పక్కనె పెట్టి, రాష్ట్రాన్ని కాపాడేందుకు వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. 
 
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని కోరారు. కేంద్రంపై న్యాయ పోరాటం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదాకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులలో రిట్ పిటిషన్లు ఉన్నాయని... వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని సూచించారు. 
 
కౌంటర్ ఫైల్ చేయడానికి 24 గంటల సమయం కూడా పట్టదన్నారు. చంద్రబాబు బాధ్యతలను నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో తనకున్న విచక్షణాధికారంతో తమను అప్పటి స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారని... ఇప్పుడు సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులను కూడా స్పీకర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

తర్వాతి కథనం
Show comments