Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆజ్ తక్ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానా కరోనాతో కన్నుమూత

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (14:29 IST)
ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్, జర్నలిస్ట్ రోహిత్ సర్దానా శుక్రవారం కన్నుమూశారు. రోహిత్ సర్దానా దాదాపు వారం క్రితం కరోనావైరస్ బారిన పడ్డారు. ఆయన మెట్రో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఐతే శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.
 
జీ నెట్‌వర్క్ నుండి తన మాజీ సహోద్యోగి సుధీర్ చౌదరితో సహా పలువురు జర్నలిస్టులు తన జర్నలిస్ట్ ఆకస్మిక మరణం గురించి సమాచారాన్ని ట్వీట్ చేశారు. టీవీ టుడే సంస్థలో సర్దానా ప్రస్తుత సహోద్యోగి కూడా టీవీ యాంకర్ మరణానికి సంతాపం తెలిపారు.
 
ఏప్రిల్ 24న రోహిత్ స్వయంగా కరోనావైరస్ బారిన పడినట్లు ట్వీట్ చేశాడు. గుండెపోటుతో ఈ ఉదయం ఆయన కన్నుమూసినట్లు సమాచారం. నిర్భయమైన విధానం, విభిన్న స్వర శైలికి ప్రసిద్ది చెందిన సర్దానా జీ నెట్‌వర్క్‌లో 'తాల్ తోక్ కే', ఆజ్ తక్‌లోని 'దంగల్' వంటి ప్రైమ్-టైమ్ టీవీ షోలను నిర్వహించారు.
 
ఆయన 2018 గణేష్ విద్యార్థి పురస్కార్ అవార్డు గ్రహీత కూడా. టీవీ యాంకర్ ఆకస్మిక మరణంతో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, రోహిత్ మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయనను "ఓ బలమైన, సూటిగా ప్రశ్నించే జర్నలిస్ట్" అని అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments