Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ నోట షారుక్ ఖాన్, సచిన్ టెండూల్కర్ మాట

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:04 IST)
సచిన్-ట్రంప్-షారూక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... షారుఖ్ ఖాన్-కాజోల్ నటించిన 'దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే', అమితాబ్ బచ్చన్-ధర్మేంద్ర 'షోలే' వంటి బాలీవుడ్ హిట్స్ గురించి ప్రస్తావించి సభలో పాల్గొన్న లక్షలాది మందిని ఆశ్చర్యపరిచారు.
 
పైగా స్క్రిప్టు చూసి చదువుతున్నారేమో అనుకోవడానికి వీలులేదు, ఎందుకంటే ఆయన నేరుగా ఎలాంటి పేపరు చూడకుండా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి పర్యటనలో ఉన్న ట్రంప్ తన ప్రసంగంలో, "బాలీవుడ్ సినిమాలు, భాంగ్రా, డిడిఎల్‌జె మరియు షోలే వంటి క్లాసిక్ చిత్రాలను చూడటంలో ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజలు ఎంతో ఆనందిస్తారు" అని అన్నారు.

చలనచిత్రాల గురించి ప్రస్తావించినప్పుడు స్టేడియం మొత్తం చీర్స్ అంటూ చప్పట్లతో మార్మోగిపోయింది. ఈ వీడియోలు సోషల్ మీడియా సైట్లలో వైరల్ అయ్యాయి. DDLJ అగ్రస్థానంలో ఉన్నది. డైహార్ట్ షారూక్ ఖాన్ అభిమానులు అందరూ ఈ వీడియోను షేర్ చేసి, "షారుఖ్ ఖాన్ జైసా కోయి నహి" అని చెపుతూ నెట్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ట్రంప్ స్టార్ క్రికెటర్లు అయిన సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లి వరకూ పేర్లు చెప్పి కేరింతలు కొట్టించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments