Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ స్టాల్ కావాలని డిమాండ్ చేయలేదు.. మందిరం కట్టమన్నా.. గెంటేశారు : ప్రవీణ్ తొగాడియా

విశ్వహిందూ పరిషత్ సంస్థ చీఫ్ ప్రవీణ్ తొగాడియాను ఆ పదవి నుంచి దించేశారు. ఇలా ఆయన్ను తప్పించడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేసి

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:46 IST)
విశ్వహిందూ పరిషత్ సంస్థ చీఫ్ ప్రవీణ్ తొగాడియాను ఆ పదవి నుంచి దించేశారు. ఇలా ఆయన్ను తప్పించడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేసినందుకే వీహెచ్‌పీ నుంచి గెంటేశారని వెల్లడించారు.
 
ముఖ్యంగా, హిందువుల సంక్షేమం కోసం 50 ఏళ్లు కష్టపడినందుకు తనకు దక్కిన ఫలితంగా భావిస్తున్నట్టు చెప్పారు. పైగా, తాను ప్రధాని పదవినో, టీ స్టాల్‌ కావాలనో డిమాండ్‌ చేయలేదనీ, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని మాత్రమే అడిగినట్టు చెప్పారు. తనకు నరేంద్ర భాయ్‌ (ప్రధాని మోడీ)తో వ్యక్తిగత సమస్యలేమీ లేవన్నారు. 
 
రామమందిర నిర్మాణంపై చట్టం చేసే విషయంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మౌనంగా ఉండడమే తనకు చికాకు తెప్పించిందన్నారు. పైగా, తాను పదవులు ఆశించేవాడినే అయివుంటే 2001లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడిననీ, కానీ తనకు మోడీతో తనకు సమస్య ఉంటే ఆయన అప్పట్లోనే ముఖ్యమంత్రిని అయ్యేవారే కాదనీ ప్రవీణ్ తొగాడియా తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments