ఖడ్గమృగం దాడి నుండి తృటిలో లక్కీగా తప్పించుకున్నాడు..వీడియో..

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (11:51 IST)
ఖడ్గమృగం ఎలా ఉంటుందో మనం చూసే ఉంటాం, కానీ అది వెంటపడడం ఎప్పుడైనా చూసారా? టూరిస్ట్‌లపైకి అమాంతం ఎలా దూసుకువచ్చిందో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వెన్నులో వణుకుపుట్టించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ ఘటన సౌత్ ఆఫ్రికన్ సఫారీ పార్క్‌లో జరిగింది. సాధారణంగా చిరుతలు, సింహాలు మరియు ఇతర మృగాలు టూరిస్ట్‌లపై దాడి చేయడం చూస్తూనే ఉంటాం. వీటి బారిన పడి టూరిస్ట్‌లు గాయాలపాలు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 
 
రియాన్ బోసోఫ్ అనే టూరిస్టు సఫారీ పార్కులో వీడియో షూట్ చేస్తూ వెళ్తున్నాడు. తన వాహనంలో ఉండి అక్కడి జంతువులను చూస్తూ వీడియో తీస్తున్నాడు. ఇంతలో ఒక తెల్లని ఖడ్గమృగం అతడి కంట పడింది. దానిని వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే రియాన్‌ను చూసిన ఖడ్గమృగం వేగంగా చాలాదూరం తరిమింది. కనీసం రెండు నిమిషాల పాటు వెంటాడింది. 
 
వాహనానికి అతి దగ్గరగా వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించింది. లక్కీగా వాహనం వేగాన్ని పెంచడంతో ఆ టూరిస్ట్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. జంతువులలో రెండో అతిపెద్ద జంతువులైన తెల్లని రైనోలు గంటకు 30 మైళ్ల వేగంతో పరుగు తీయగలవు. వైరల్‌గా మారిన వీడియోని మీరు ఓ సారి చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

డైరెక్టర్ రవిచరణ్ రెండవ చిత్రం నవాబ్ సిద్ధం, జూన్ లో జెన్ జి గర్ల్స్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments