Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేలాడే వంతెన‌పై స్టంట్స్-నీటిలో పడిపోయిన టూరిస్టులు.. వీడియో

Advertiesment
వేలాడే వంతెన‌పై స్టంట్స్-నీటిలో పడిపోయిన టూరిస్టులు.. వీడియో
, శనివారం, 13 ఏప్రియల్ 2019 (10:42 IST)
సాధారణంగా మనలో వేలాడే వంతెనపై నడవాలంటే ఇప్పటికీ బయపడుతుంటారు. ఆ వంతెన ఊగుతుంటే అది ఎక్కడ కూలిపోతుందోనని చాలామందికి వణుకు పుడుతుంది. అలాంటిది దానిని ఊపితే ఇంకేమైనా ఉందా? అలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది. తాజాగా వేలాడే వంతెన నిజంగానే కూలిపోయింది.


సుయినింగ్ దేశంలోని జియాంగ్సులో ఉన్న టూరిస్ట్ స్పాట్‌లో ఉన్న వేలాడే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
చెక్కలతో చేసిన ఆ వేలాడే వంతెనపై పదుల సంఖ్యలో పర్యాటకులు నడుస్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్న టూరిస్టులంతా కింద ఉన్న నీటిలో పడిపోయారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
 
అయితే ఇటీవల వేలాడే వంతెనల మీద సరదాగా ఆటాడుకోవడం చైనాలో అలవాటుగా మారిందట. వేలాడే వంతెనల మీదికి వెళ్లి దాన్ని అటూ ఇటూ ఊపుతూ చైనీయులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వంతెనపై కూడా కొంద‌రు టూరిస్టులు అలాగే చేయబోయారు. అయితే అది కాస్త వాళ్లకే రివర్స్ అయింది. వాళ్ల ఊపుడును తట్టుకోలేని బ్రిడ్జ్ కూలిపోయింది.
 
గత సంవత్సరం కూడా ఇలాగే చైనాలో పాదాచారుల వంతెన కూలిపోయింది. టూరిస్టులు ఆ వంతెన మీద నడుస్తుండగా అది కూలిపోయింది. అయితే ఆ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలను ఆపేసినప్పటికీ టూరిస్టులు ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్లే సరికి వాళ్ల బరువును తట్టుకోలేక ఆ బ్రిడ్జి కూలిపోయింది. ఆ వీడియోని మీరు కూడా ఓసారి చూడండి మరి..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను సన్యాసిని.. నాకు ఓటెయ్యకుంటే నిన్ను శపిస్తా..