Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట ప్రియుడిని కలిసేందుకు గ్రామానికే కరెంట్ లేకుండా చేసింది..!

Webdunia
బుధవారం, 19 జులై 2023 (09:53 IST)
రాత్రిపూట ప్రియుడిని కలవడానికి ఓ యువతి గ్రామంలో కరెంటు లేకుండా చేసింది. ఈ ఘటన బీహార్‌లోని బెటియా గ్రామంలో చోటుచేసుకుంది. వారిద్దరినీ పట్టుకున్న స్థానికులు యువతి, యువకుడిని కొట్టి కుటుంబసభ్యుల జోక్యంతో పెళ్లి నిశ్చయించారు.
 
ఈ ఘటన బెటియా గ్రామంలోని నౌథాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రి ప్రియుడు తనను చూసేందుకు వస్తున్నాడని తెలుసుకున్న మహిళ గ్రామంలోని విద్యుత్ కనెక్షన్‌ను నిలిపివేసింది. యువకుడు గ్రామానికి చేరుకున్నాడు. కాని గ్రామస్థులు వారిని పట్టుకుని, విచారించి, ఆపై వారిని కొట్టారు. 
 
గ్రామస్థులు ప్రేమికుడిని కొట్టడంతో యువతి జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. బాలికను కాపాడే క్రమంలో కొందరు యువకులు ఆమె ప్రియుడిని బెల్టుతో కొట్టారు. చివరకు యువతి, యువకుడి కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు.
 
స్థానికుల సమక్షంలో జరిగిన చర్చలో ఇరు కుటుంబాల వారు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వారిపై ఓ  ముఠా దాడి చేసిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో కేసు నమోదు చేసినట్లు నౌథాన్ పోలీసులు తెలిపారు. యువకుడిపై దాడి చేసిన ముగ్గురిని అరెస్టు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారి ఖలీద్ అక్తర్ తెలిపారు.
 
యువతి, యువకుడు ప్రేమలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సమస్య సద్దుమణిగిందని, త్వరలో ఇద్దరి వివాహం జరుగుతుందని బంధువులు తెలిపారు. ప్రేమికుడిని బలవంతంగా పట్టుకుని బెల్టుతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments