Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గేద్యేలే... జూన్ 4 ఉదయం 10:30 గంటలకు వైసిపి సంబరాలు, 9న జగన్ సీఎం: సజ్జల సందేశం

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (17:30 IST)
తగ్గేద్యేలే అన్నట్లున్నారు వైసిపి నాయకులు. ఆ పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సైలెంట్ ఓటింగ్ చేసారన్నారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఓటింగ్ సరళి సాగిందని చెప్పారు. అందుకే మా పార్టీ శ్రేణులకు రేపు ఉదయం గం. 10:30 నుంచి సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా వుండాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా జూన్ 9వ తేదీన ముందుగా ప్రకటించినట్లుగానే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే సంస్థ ఆదివారం నాడు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. దీనిపై వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఆశ్చర్యం వేసిందన్నారు. ఆశ్చర్యం కాదు.. నవ్వొచ్చిందన్నారు. ఆ ఫలితాల్లో వైకాపాకు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారని అవి కూడా దయతో ఇచ్చారేమో అర్థం కావడం లేదన్నారు. మరీ ఎక్కువ సీట్లు ఇస్తే బాగోదు అనుకున్నారేమో అంటూ ఇండియా టుడే ఎగ్జిట్ ఫలితాలపై సజ్జల అసహనం వ్యక్తం చేశారు. 
 
అలాగే, పోస్టల్ బ్యాలెట్లపై ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందిస్తూ, 'పోస్టల్ బ్యాలట్లకు సంబంధించి తన మార్గదర్శకాలకు విరుద్ధంగా తాజాగా ఈసీ జారీచేసిన ఆదేశాలు బరితెగించి ఇచ్చినట్లు ఉన్నాయి. ఈ ఆదేశాలు తికమక పెట్టడానికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు. అధికారి సంతకం ఉంటే సరిపోతుందని.. సీల్, ఇతర వివరాలు అక్కర్లేదని చెబుతున్నారు. ఇది మరీ అడ్డగోలుగా ఉంది. సంతకం ఎవరిదన్న విషయం ఎవరికి తెలుస్తుంది? ఈసీ నిబంధనలకు వాళ్లే తూట్లు పొడిచారు. ఆ సంతకం సంబంధిత అధికారిది కాకపోవచ్చు. కానీ అధికారులు మాత్రం సీల్ అవసరం లేదని చెప్పారు. అదీ మన రాష్ట్రంలోనే. అందుకే దీన్ని సవాలు చేశాం. హైకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments