Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై వెళ్తుండగా.. పెద్దపులి వెంబడించింది... వైరల్ వీడియో(Video)

Webdunia
సోమవారం, 1 జులై 2019 (12:50 IST)
కేరళలో ఓ పులి బైకులో వెళ్తున్న వ్యక్తికి చుక్కలు చూపించింది. పెద్దపులి కనిపిస్తే ఇంకేముంది.. పారిపోతాం... గుండె భయంతో జారిపోతుంది. అలాంటి పెద్దపులి బైకుపై వెళ్తున్న ఇద్దరిని అరగంట పాటు వెంబడించింది. ఇక వారి పరిస్థితి ఎలా వుంటుందో వూహించుకోండి. అవును ఇలాంటి ఘటనే కేరళలోని ముతంగా అభయారణ్యంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వ్యక్తులు అభయారణ్యంలో బైక్‌పై వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ పెద్దపులి తమను వెంబడించడాన్ని గమనించారు. దీంతో బైక్‌ వెనుక కూర్చొన్న వ్యక్తి వీడియో తీయడం మొదలు పెట్టాడు. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన పులి కొన్ని సెకన్ల పాటు వారిని వెంబడించింది. బైకు నడుపుతున్న వ్యక్తం భయపడకుండా బండిని నడిపాడు.
 
బైక్‌ నడుపుతున్న వ్యక్తి ఏమాత్రం భయపడి అదుపుతప్పినా పులి వారిపై దాడి చేసేది. ఫారెస్ట్స్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ (ఎఫ్‌ఏడబ్ల్యూపీఎస్‌) అనే ఎన్జీవో ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. ఆ బైక్‌పై ప్రయాణించేది అటవీశాఖ అధికారులని, ఆ ప్రాంతంలో పులుల సంచారం ఎలా ఉందనే విషయాన్ని అధ్యయనం చేయడానికి వారు వెళ్లగా, ఈ ఘటన చోటుచేసుకుందని ఎఫ్‌ఏడబ్ల్యూపీఎస్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments