Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.7 కోట్ల ప్యాకేజీ.. ప్చ్.. భార్య విడాకులు అడుగుతోంది.. జీవితంలో ఓడిపోయా!!

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (13:27 IST)
నిత్యం తన పనిపైనే ధ్యాసపెట్టుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చివరకు జీవితంలో తాను ఏమి కోల్పోయాడో తెలుసుకుని కుమిలిపోతున్నాడు. సంవత్సరానికి రూ.7 కోట్ల వేతన ప్యాకేజీతో ప్రమోషన్ పొందిన ఆనందం కొన్ని క్షణాల్లో ఆవిరైపోయాయి. రూ.7 కోట్ల ప్యాకేజీ తన భార్యను సంతోషపెట్టలేకపోయిందనీ, ఆమె తనపై విరక్తి చెంది విడాకులు అడుగుతోందన్నారు. 
 
ఉద్యోగ రీత్యా ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ తాను మాత్రం జీవితంలో ఓడిపోయినట్టు వాపోతున్నాడు. ఒక చేత్తో ప్రమోషన్ లేఖ, మరోవైపు విడాకుల నోటీసులు అందుకున్నట్టు తెలిపారు. 
 
ఈ మేరకు ఓ టెక్కీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. మూడేళ్ల క్రితం తాను ఓ కంపెనీలో సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌గా చేరానని, ప్రమోషన్ కోసం రోజుకు 14 గంటల పాటు పని చేశానని, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరం మీటింగులతో బిజీబిజీగా ఉండేవాడినని తెలిపారు. 
 
ఈ క్రమంలో తన కుమార్తె పుట్టిన సమయంలో కూడా భార్య పక్కన ఉండే అవకాశాన్ని కూడా వదులుకున్నట్టు చెప్పాడు. ఆ సమయంలోనూ తాను వర్క్‌లో మునిగిపోయాననీ, ప్రసవం తర్వాత తన భార్య మానసిక ఒడిదుడుకులకు గురైందన్నారు. 
 
కౌన్సిలింగ్ కోసం వైద్యుడుని కలిసేందుకు వెళితే తాను తోడుగా వెళ్లలేకపోయినట్టు చెప్పాడు. బంధుమిత్రులను కలవడం, శుభకార్యాలకు హాజరు కాలేకపోయినట్టు చెప్పాడు. ఇవన్నీ త్యాగం చేసి ఉద్యోగానికే అంకితమైనట్టు తెలిపారు. తన కష్టాన్ని గుర్తించి మూడేళ్ల తర్వాత ప్రమోషన్ వచ్చిందన్నారు. రూ.7.8 కోట్ల వార్షిక వేతనం అందుకోబోతున్నట్టు చెప్పారు. 
 
అయితే, భార్య తనతో కలిసి ఉండేందుకు ఇష్టపడటం లేదని, విడాకులు కోరుతుందని చెప్పారు. ఏ ప్రమోషన్ కోసం అయితే, మూడేళ్లు కష్టపడ్డానో అదే తన వ్యక్తిగత జీవితంలో మంటబెట్టిందని వాపోయాడు. ఈ పోస్టుపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంచనాలకు మించి వసూళ్ళను రాబట్టిన రీ-రిలీజ్ మూవీలు

1000 వాలా చిత్రం టీం వర్క్ చాలా ముచ్చట వేసింది : సుమన్

బ్రహ్మానందం నవ్విన్చాడా, ఎడిపించాడా ! బ్రహ్మా ఆనందం రివ్యూ

చెట్టు పేరు, జాతి చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదు.. మంచు మనోజ్

BoycottLaila వద్దు welcome Lailaను ఆదరించండి.. పృథ్వీరాజ్ క్షమాపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments