Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Techie : భార్యాభర్తల గొడవలు.. పెళ్లి జరిగి ఐదు నెలలే.. ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకుని టెక్కీ సూసైడ్

Advertiesment
woman

సెల్వి

, శుక్రవారం, 13 డిశెంబరు 2024 (12:52 IST)
భార్యాభర్తల గొడవలు ఓ టెక్కీ ప్రాణం తీసింది. భర్త కాంట్రాక్టర్, భార్య టెక్కీ. ఏమైందో తెలీదుగానీ ఇద్ధరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరి కోపం రెట్టింపు అయ్యింది. ఇక ఈ గొడవలకు ఫుల్ స్టాఫ్ పెట్టాలనుకున్న టెక్కీ.. చివరకు ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకుని సూసైడ్ చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  మహిళ పేరు వెంకట నాగలక్ష్మి, వయస్సు సుమారు 29 ఏళ్లు. 
 
ఈమె సొంతూరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. చాట్రాయి మండలానికి చెందిన ఈమె, హైదరాబాద్‌తో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఐదు నెలల కిందట నాగలక్ష్మికి సొంత జిల్లా ముసునూరు మండలానికి చెందిన మొవ్వ మనోజ్ మణికంఠతో వివాహం జరిగింది. 
webdunia
Techie
 
తొలుత ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఇలాంటి జీవితం తనకు వద్దని నిర్ణయించుకుంది. ఆన్‌లైన్‌లో తెప్పించుకున్న విషం బుధవారం తాగింది. వెంటనే గమనించిన ఇంటి యజమాని, ఆమె కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 
 
గురువారం ఆ టెక్కీ మృతి చెందింది. భర్త వేధింపులతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెక్కీ అతుల్ ఆత్మహత్య - పరారీలో భార్య... అత్త అరెస్టు